Share News

పరిశ్రమలొస్తున్నాయ్‌..!

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:15 AM

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు విశాఖలో గత నెలలో 13,14 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సు నాంది పలికింది.

పరిశ్రమలొస్తున్నాయ్‌..!
కార్వాన్‌ పార్కు

811 మందికి ఉద్యోగాలు

విశాఖ పెట్టుబడుల సదస్సు సాధించిన ఘనత

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు విశాఖలో గత నెలలో 13,14 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సు నాంది పలికింది. సొంత స్థలాలున్న పారిశ్రామిక వేత్తలు ఐదుచోట్ల పరిశ్రమల స్థాపనకు ఒప్పందా లు చేసుకున్నారు. మొత్తం 371 కోట్లను పెట్టుబడు లు పెడతామని, ఇందులో 811 మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయా సంస్థలు ఒప్పందా లు చేసుకున్నాయి. అన్నీ సక్రమంగా జరిగి అను మతులు, ఇతర లాంఛనాలు పూర్తయితే ఏడాది లోపే స్థానికంగా యువతకు ఉద్యోగ అవ కాశాలకు బాటలు వేయనున్నారు.

సీహెచ్‌ పోతేపల్లిలో పామాయిల్‌ రిఫనరీ

గత నెలలోనే ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌ పోతేపల్లిలో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ను విస్తరించడానికి శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ రూ.209 కోట్ల వ్యయంతో 66 మంది ఉపాధి కల్పించనుంది. ప్రధానంగా పామా యిల్‌ రిఫైనరీ, నాన్‌ డెయిరీ క్రీమర్‌ ప్యాట్స్‌, ఇతర ఉత్పత్తులను తయారు చేయనుంది. దీనికి కూడా పెట్టుబడుల సదస్సులో ఒప్పందం కుదుర్చు కున్నారు.

మరో మూడు పరిశీలన

అక్షోభ్య అనే సంస్థ రొయ్యల ప్రాసెసింగ్‌ యూని ట్‌ను రూ.30 కోట్ల వ్యయంతో స్థాపించి 450 మందికి ఉపాధి కల్పిస్తామని ముందు కొచ్చింది. సుధీష్‌రామ్‌ రెన్యువల్‌ ఎనర్జీ సంస్థ రెన్యువల్‌ ఎనర్జీ ఎక్విప్‌మెంట్‌ అసెబుల్డ్‌ తయారీ పరిశ్రమకు సిద్ధ మైంది. రూ.50 కోట్ల వ్యయంతో 60 మంది ఉద్యోగా లను కల్పించనుంది. వీరు స్థల పరిశీలనలో ఉన్నా రు. సాన్సో ఫార్మా రూ.75 కోట్ల వ్యయంతో 200 మందికి ఉపాధి కల్పించేందుకు ఫార్మా స్యూటికల్‌ డ్రగ్స్‌ కంపెనీని నెలకొల్పనుంది. దీనికి మూడెకరాలు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఈ మూడు పరిశ్రమ లకు సంబంధించి స్థలాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం తో ఇతర అనుమతులను జిల్లా యంత్రాంగం ఇవ్వాల్సి ఉంది. ఆయా సంస్థలు ఎక్కడ నెలకొల్పు తాయో అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

దెందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారి సమీపంలో ఇయాన్‌ సంస్థ టూరిజంకు అనుసంధానంగా రవాణారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ పరిశ్రమన స్థాపనకు ముందుకొచ్చింది. ఈ సంస్థకు సొంత ంగా ఉన్న 1.5 ఎకరాల స్థలంలో ఇంట్రిగేటెడ్‌ ట్రావెల్‌ హబ్‌ (కార్వాన్‌ పార్కు)ను ఏర్పాటు చేయనుంది. దీనికి ఏడు కోట్ల వ్యయం చేస్తామని.. తద్వారా 35 మంది ఉపాధి కల్పించనున్నట్టు తెలి పింది. కేరళ తరహాలో కార్వాన్‌ పార్కులో అత్యా ధునిక వసతులను ట్రావెలర్స్‌కు కల్పిస్తారు. కాటేజీ లు, వివిధ ప్యూయల్స్‌ నింపుకోవడంతో పాటు, బస్సుల్లోనే విడిది చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.

Updated Date - Dec 04 , 2025 | 01:15 AM