Share News

పంద్రాగస్టు పండగకు ముస్తాబు

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:28 AM

పంద్రాగస్టు పండగకు జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల, కళాశాలల్లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

పంద్రాగస్టు పండగకు ముస్తాబు
కలెక్టరేట్‌ వద్ద ఏర్పాట్లు

కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు

జాతీయ పతాకం ఆవిష్కరించనున్న

మంత్రి నిమ్మల రామానాయుడు

ప్రభుత్వ పథకాలతో శకటాలు, స్టాల్స్‌

సాంస్కృతిక ప్రదర్శనలు

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు

పంద్రాగస్టు పండగకు జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల, కళాశాలల్లో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌ వద్ద జాతీయ పతాకావిష్కరణ, ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించే శకటాలు, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసు వందనం స్వీకరిస్తారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 400 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇస్తారు. స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలను అధికారులు సత్కరిస్తారు. కలెక్టరేట్‌ ఆవరణ, జిల్లా పోలీసు కార్యాలయాలను స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు చేశారు.

భీమవరం టౌన్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్‌ కార్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. శుక్రవారం ఉద యం 9 గంటలకు కలెక్టరేట్‌ వద్ద నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండా ఎగుర వేస్తారు. పోలీస్‌ గౌరవ వదనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, అనం తరం వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను మంత్రి అందజేస్తారు. 400 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అంద జేయనున్నారు.

వేడుకలకు మూడు రోజులుగా ఏర్పా ట్లు చేస్తున్నప్పటీకి బుధవారం కురిసిన భారీ వర్షం తో ఇబ్బందులు ఏర్పడ్డాయి. గురువారం కూడా వర్షం కురిస్తే ప్రత్నామ్నాయ చర్యలు ఆలోచించారు. గురువారం ఉదయం నుంచి వాతావరణం అనుకూలంగా ఉండటంతో చకచకా ఏర్పాట్లు చేశారు. మూడు పెద్ద వేదికలు, రెండు చిన్న వేదికలు, గ్యాలరీ, స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రతిబింబించే వివిధ శాఖలకు సంబంధించి 6 శకటాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రోటోకాల్‌ మేరకు సీటింగ్‌, స్టేజీ ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం పటిష్టంగా ఏర్పాటు చేశారు. విద్యుత్‌ సరఫరా అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరం అత్యవసర మందులు, అంబులెన్స్‌ సిద్ధం చేశారు. సాంస్కృతిక కార్యక్రమా లు విద్యార్థులు, ప్రజలు తిలకించే విధంగా ఏర్పాటు చేసారు. అల్పపడీన ద్రోణి కారణంగా భారీ వర్షాలు, బలమైన గాలులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదిక, స్టాల్స్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఏర్పాట్లను జేసీ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డీఆర్వో మొగిలి వెంకటేశ్వరరావు, అధికారులు పర్యవేక్షించారు.

Updated Date - Aug 15 , 2025 | 12:28 AM