యథేచ్ఛగా అక్రమ మైనింగ్
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:40 AM
నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై అధికారు లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలు వెత్తుతున్నాయి.
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో మైనింగ్ ఆరోపణలు.. మంత్రికి బీజేపీ నాయకుడి ఫిర్యాదు
(నూజివీడు–ఆంధ్రజ్యోతి)
నూజివీడు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్‌పై అధికారు లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలు వెత్తుతున్నాయి. అందుకు ప్రధాన కారణం అధికార తెలుగు దేశం నాయకుల కనుసన్నల్లో ఈ అక్రమ మైనింగ్ సాగడమే నన ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా గ్రామాల్లో చెరు వుల మేటను ఆయా గ్రామాల పరిధిలో మెరువాకు తోలు కోవచ్చు. కాని సాధారణ ప్రజలు ఒక్క ట్రాక్టర్ మట్టి తోలుకు నేందుకు అవకాశం ఉండడం లేదు. కానీ నూజివీడు మండ లం గొల్లపల్లి నుంచి కృష్ణా జిల్లా పరిధిలోని బాపులపాడు మండలం మల్లపల్లికి ఈ మట్టి యథేచ్ఛగా తరలిపోతోంది. గొల్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని నీలాద్రిచెరువులో మూడు రోజులుగా అక్రమ మైనింగ్ సాగుతున్న విషయం అధికార కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నూజివీడు మండల మాజీ అధ్యక్షుడు, గ్రామ మాజీ సర్పంచ్ గోగినేని శ్రీనివాస కుమార్ అప్పారావు మంత్రి,ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దృష్టికి,డివిజన్, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగడం గమనార్హం. దీనినిబట్టి మైనింగ్ మాఫియా నూజివీడు నియో జకవర్గంలో ఏవిధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.