నూజివీడుకు ఐఐపీఎం
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:03 AM
కేంద్ర వాణి జ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రతి ష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానిటేషన్ మేనేజ్‌మెంట్(ఐఐపీఎం)ను నూజివీడు లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమి కేటాయించింది.
పది ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
నూజివీడు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి):కేంద్ర వాణి జ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రతి ష్టాత్మక జాతీయ విద్యా సంస్థ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానిటేషన్ మేనేజ్‌మెంట్(ఐఐపీఎం)ను నూజివీడు లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల భూమి కేటాయించింది. ఇప్పటికే ఈ విద్యా సంస్థ బెంగ ళూరులో నడుస్తోంది. తాజాగా మరో ఇనిస్టిట్యూట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో దీనిని ఏలూరు జిల్లా నూజివీడులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణ యించింది. ఇది స్వయం ప్రతిపత్తిగల విద్యాసంస్థ. వ్యవ సాయ వ్యాపారం, తోటల నిర్వహణ, సంబంధిత రంగాల లో ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిని విద్యార్థులకు అంది స్తుంది. ఈ విద్యా సంస్థ అగ్రి బిజినెస్ ప్లాంటేషన్, మేనే జ్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఎగుమతులలో పోస్టు గ్రాడ్యు యేషన్ ఫెలోషిప్(ఎఫ్‌పీఎం సర్టిఫికెట్) కోర్సులు, ప్రోగ్రా మ్‌లను అందిస్తుంది. పీజీడీఎం ఫెలోషిప్ వంటి కోర్సుల తోపాటు పరిశ్రమ కేంద్రీ కృత కార్యక్రమాలను అందిస్తుం ది. నిర్దేశిత కోర్సుల ద్వారా విద్యార్థులను, నిపుణులను తీర్చిదిద్దడం ఈ విద్యా సంస్థ లక్ష్యం. దీని ఏర్పాటుతో వ్యవసాయం, ఉద్యాన పంటలు అధికంగా సాగుతున్న చేస్తున్న గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుంది.