అధికారులు ఉత్తమ సేవలు అందించాలి
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:57 PM
క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని చట్టప్రకారం పరిష్కరించి సమర్థవం తమైన అధికారులుగా ఉత్తమ సేవలను ప్రజలకు అందించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదివారం ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు.
ఐజీ జీవీజీ అశోక్‌కుమార్
ఏలూరు క్రైం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని చట్టప్రకారం పరిష్కరించి సమర్థవం తమైన అధికారులుగా ఉత్తమ సేవలను ప్రజలకు అందించాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఆదివారం ప్రొబేషనరీ డీఎస్పీలకు సూచించారు. ఏలూరు రేంజ్ కార్యాలయంలో ప్రొబేషనరీ డీఎస్పీల పనితీరుపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్పీల ఉద్యోగ నిర్వహణ, క్షేత్రస్థాయిలో పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు లా అండ్ ఆర్డర్‌లో నిర్వర్తించిన విధులను సమర్థవంతంగా నేర్చుకుని భవిష్యత్ కాలంలో వాటిని వినయోగించుకోవాలని సూచించారు, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను ఆలకించి తగిన సూచనలు, సలహాలతో క్రిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. సమావేశంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివకిశోర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా పాల్గొన్నారు.