Share News

రూ. వంద చెల్లిస్తే..!

ABN , Publish Date - Dec 11 , 2025 | 12:39 AM

వారసత్వ వ్యవసాయ భూముల రిజి స్ర్టేషన్లకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కుటుంబ సభ్యుల మధ్య భాగాల పంపిణీ ఒప్పందాల రిజిస్ర్టేషన్‌ రుసుంలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జీవో 478 ద్వారా పలు మార్గ దర్శకాలను విడుదల చేసింది.

రూ. వంద చెల్లిస్తే..!

తల్లిదండ్రుల ఆస్తుల పంపకాలకు లైన్‌ క్లియర్‌..చార్జీల భారం తగ్గింపు

చాన్నాళ్లు విభజించుకోని వారికి ప్రయోజనం

వారసత్వ వ్యవసాయ భూముల రిజి స్ర్టేషన్లకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. కుటుంబ సభ్యుల మధ్య భాగాల పంపిణీ ఒప్పందాల రిజిస్ర్టేషన్‌ రుసుంలో సమూల మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జీవో 478 ద్వారా పలు మార్గ దర్శకాలను విడుదల చేసింది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ఒకప్పుడు ఆస్తి విలువపై ఒక శాతం స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ ఫీజులు రూపేణ కనీసం రూ.10 వేలు భారంగా కట్టేవారు. తాజాగా నిర్ణయంతో ఈ భారం నుంచి ఉప శమనం లభించనట్లే. జిల్లా వ్యాప్తంగా 12 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఈ ఆస్తుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క రిజిస్ర్షేషన్‌ కూడా జరగ లేదని అధికారులు చెబుతున్నారు. వారసత్వంతో వచ్చిన ఆస్తుల రిజిస్ర్టేషన్‌ విలువ రూ.10 లక్షలు లోపు ఉంటే స్టాంప్‌ డ్యూటీగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల పైన ఆస్థి విలువ ఉంటే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అదీ వ్యవ సాయ భూమికి మాత్రమే వర్తిస్తుంది. తమ ఆస్తులకు వీలునామా రాయకుండా కుటుంబ పెద్ద మరణిస్తే ఆయన ఆస్తుల్ని భార్య, పిల్లలు భాగాలు పంపిణీ చేసుకుంటారు. ఇలాంటి వ్యవహారాలకు ప్రస్తుత ఉత్తర్వులు వర్తించనున్నాయి.

ఇకపై శరవేగంగా రిజిస్ర్టేషన్లు

కుటుంబ సభ్యుల మధ్య వాటాల పంపిణీకి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో వార సత్వ భూముల రిజిస్ర్టేషన్లు ఊపందుకోను న్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూములను రిజిస్రేష్టన్‌ చేసుకుంటే ఆటో మ్యుటేషన్‌ జరగనుంది. వారికి పట్టాదారు పాస్‌ పుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయి. చాలా కాలం నుంచి వ్యవసాయ భూములను వార సత్వంగా వచ్చిన వాటికి రిజిస్ర్టేషన్ల ద్వారా విభజన జరగలేదు. పార్టియేషన్‌ దస్తావేజులకు వారు పంచుకున్న ఆస్తుల విభజన బట్టి వివిధ రకాలుగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ర్టేషన్ల ఛార్జీలు చెల్లించేవారు. ప్రస్తుతం జీవో 478 ప్రకారం వారసత్వ భూములను పార్టియేషన్‌ దస్తావేజులుగా రిజిస్ర్టేషన్‌ చేయడానికి ఆ జీవోకు లోబడి రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి.

అధికారులకు మార్గదర్శకాలు

వ్యవసాయ ఆస్తులకు సంబంధించిన పత్రాలను నమోదు చేసేటప్పుడు అనుసరించా ల్సిన విధి విధానాలను స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ ఇటీవల విడుదల చేసింది. రెవెన్యూశాఖ నిర్వహించే వెబ్‌ల్యాండ్‌ ఎలక్ర్టానిక్‌ రికార్డుల్లోని పట్టాదార్‌ కాలమ్‌లో పత్రం సమర్పించిన నాటికి పొందిన ఎన్‌కంబరెన్స్‌ (ఈసీ) సర్టిఫికెట్‌లో క్లయిమ్‌దారుడుగా రిజిస్ర్టేషన్‌ చేయించే వారి పేరు ప్రతిబింబించకపోతే వ్యవసాయ ఆస్తుల రిజిస్ర్టేషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. భూముల రీ సర్వే పూర్తయిన ప్రాంతాల్లో లేదా భూ హక్కుపత్రాలు జారీ చేసిన ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్లు ఎల్‌పీఎం నెంబర్లు ఆధారంగా మాత్రమే రిజిస్ర్టేషన్లు చేయాలి. వ్యవసాయ ఆస్తులకు సంబంధించిన అన్ని విభజన పత్రాలకు, రాతపూర్వకంగా మరణించినట్టు చెప్పబడిన పూర్వీకుల యజమానులు లేదా సహా పార్టనర్లను సూచించే పత్రాలకు కూడా వర్తిస్తాయి. జిల్లా వ్యాప్తంగా వారసత్వ ఆస్తులను రిజిస్ర్టేషన్లు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా రిజిస్ర్టార్‌ కె.శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు చాలాకాలంగా ఆస్తుల పంపకం చేసుకోలేని వారికి నామినల్‌ ఖర్చుతోనే రిజిస్ర్టేషన్లు చేసుకునే మంచి అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు.

Updated Date - Dec 11 , 2025 | 12:40 AM