Share News

మూడు రోజులే గడువు!

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:28 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాం తాల్లో ఇళ్ల నిర్మాణానికి, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌)– ఎన్టీఆర్‌ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి.

మూడు రోజులే గడువు!

సొంతిల్లు–ఇంటి స్థలం కోసం దరఖాస్తుల వెల్లువ

పీఎంఏవై గ్రామీణ్‌లో కొత్తగా ఇళ్ల కోసం దరఖాస్తులు

30 వరకు గడువు.. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు 22,388

ఆవాస్‌ ప్లస్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుల ఎంపిక

ఏలూరుసిటీ, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాం తాల్లో ఇళ్ల నిర్మాణానికి, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌)– ఎన్టీఆర్‌ పథకాన్ని అమలు చేస్తున్నాయి. అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ తీసుకొచ్చి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి.

కొత్తగా ఇళ్లకు, ఇళ్ల స్థలాలకు గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇప్పటికే జిల్లాలో 22,388 దర ఖాస్తులు వచ్చాయి. సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తారు. అసలు స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మూ డు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇంటి నిర్మాణాన్ని చేపడ తారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ ఇళ్ల నిర్మాణాలను అసం పూర్తిగా పూర్తి చేసిన వారికి మిగిలిన భాగం పూర్తి చేయ డానికి దరఖాస్తులు కోరుతున్నారు. గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక

ఇళ్ల నిర్మాణంలో లబ్దిదారుల ఎంపిక పకడ్భంధీగా జరి గేలా కేంద్ర ప్రభుత్వం ఆవాస్‌ప్లస్‌ అనే ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. రాష్ట్రంలో అర్హులను గుర్తించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని ఇంజనీరింగ్‌ అసి స్టెంట్‌, గృహనిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించిం ది. వీరు ఇంటింటికీ వెళ్లి అర్హులను గుర్తించాలి. దరఖాస్తు దారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు, లొకేషన్‌ ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు, కొత్తగా ఎక్కడ ఇంటి నిర్మాణం చేపడతారో ఆ స్థలాన్ని ఫొటో తీస్తారు. దరఖాస్తుదారు ఫొటోను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ముఖ గుర్తింపును యాప్‌ క్యాప్చర్‌ చేసిన వెంటనే ఆధార్‌ కార్డు ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. జాబ్‌ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు తీసుకుంటారు. దరఖాస్తుదారుల్లో మొదట అత్యం త పేదలకే ఇల్లు మంజూరయ్యేలా యాప్‌ను కేంద్ర ప్రభు త్వం డిజైన్‌ చేసింది. యాప్‌లో నమోదైన వివరాల ఆధా రంగా అర్హుల జాబితా సిద్ధం కానుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదిం చనున్నారు, అక్కడ మరోసారి పరిశీలించి తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు మంజూరు అవుతుంది.

నెలాఖరు వరకు గడువు

ఇంటి స్థలం ఉండి ఇల్లులేని వారు, అసలు ఇంటి స్థలం లేనివారు, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన వారిలో అర్హులు ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే జిల్లాలో 22, 388 దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన వారిని ఎంపిక చేసి ఇల్లు, ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తారు. ఇంకా మూడు రోజులు మాత్రమే గడువు ఉండటంతో అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.

– జి.సత్యనారాయణ, జిల్లా హౌసింగ్‌ పీడీ

Updated Date - Nov 28 , 2025 | 12:28 AM