Share News

పేదింటికి వరం!

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:56 AM

రాష్ట్రం లోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టి స్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పేదింటికి వరం!

పేదల ఇళ్ల యూనిట్‌ వ్యయం పెంపు

ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల రాయితీ

పీఎంఏవై 2.0 అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌

కొత్తగా మంజూరైన పీఎంఏవై అర్బన్‌ ఇళ్లకు వర్తింపు

తాజాగా మార్గదర్శకాలు విడుదల

జిల్లాలో పీఎంఏవై అర్బన్‌ ఇళ్లు 1606

ఏలూరుసిటీ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లోని అర్హులైన పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు కట్టి స్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల యూనిట్‌ వ్యయాన్ని రూ.1.80 లక్షలు మాత్రమే కేటాయించింది. ఆ ఐదేళ్లు పేదల ఇళ్ల నిర్మా ణం ముందుకు సాగలేదు. పేదల సొంతింటి కల కల గానే మిగిలిపోయింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్ల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేందుకు గృహ నిర్మాణ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇదే తరుణంలో కేంద్రం తాజాగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై అర్బన్‌) 2.0 పథకా న్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర కొత్తగా మంజూ రు చేసే ఇళ్లకు యూనిట్‌ వ్యయాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు. ఇందులో కేంద్ర వాటాగా గతంలో మాదిరి గానే రూ.లక్షా 50 వేలు, రాష్ట్ర వాటాగా రూ.లక్ష జత చేస్తారు. రాష్ట్రంలో తొలివిడతగా పీఎంఏవై అర్బన్‌ 2.0 ఇళ్లకు ఈ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించారు.

జిల్లాలో పీఎంఏవై అర్బన్‌ 2.0 ఇళ్లు 1,606

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఇళ్ల రాయితీ పీఎంఏవై ఆర్బన్‌ 2.0కు వర్తింపజేస్తున్నారు. ఇప్పటికే జిల్లా గృహనిర్మాణ శాఖ నిర్వహించిన సర్వేలో సొంతిం టి స్థలం ఉన్న వారిని ఈ పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్‌ 2.0 పథకం లో 1606 ఇళ్లు మంజూరయ్యాయి. ఏలూరు నగరంలో 681, జంగారెడ్డిగూడెం అర్బన్‌లో 252, చింతలపూడిలో 394, నూజివీడులో 279 వరకు ఉన్నాయి. ఈ ఇళ్లన్నిం టికీ కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2.50 లక్షల రాయితీ వర్తిస్తుంది. ఇంకా జిల్లాలో సొంతింటి స్థలం ఉన్న లబ్ధిదారులు ఈ పథకం కోసం సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. తగిన ఆధారాలు అంటే ఆధార్‌ కార్డు, కుల, ఆదాయ, స్థలానికి సంబంధించిన డాక్యు మెంట్లు/ ల్యాండ్‌ పొజిషన్‌ సర్టిఫికేట్‌ వంటి ధ్రువపత్రా లను అందజేసి దరఖాస్తు చేసుకోవాలి.

ఇళ్ల నిర్మాణంలో మూడోస్థానం

ఈ ఏడాది జిల్లాలో పీఎంఏవై అర్బన్‌/ పీఎంఏవై గ్రామీణ్‌లో 12,345 గృహాలు నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దే శించుకోగా ఇప్పటివరకు 12,022 ఇళ్ల నిర్మాణాలు పూర్త య్యాయి. రాష్ట్రంలో ఏలూరు జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. మిగిలిన నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

సొంత స్థలం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

జిల్లాలో పేదల గృహ నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. లక్ష్యాలను సాధించడంలో జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇంకా సొంత స్థలం ఉన్న లబ్ధిదారులు సంబం ధిత ధ్రుపత్రాలతో సచివాలయాల్లో దరఖాస్తు చేసు కోవచ్చు. పీఎంఏవై అర్బన్‌ పథకంలో కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగానే పూర్తి చేస్తాం. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలకు అను గుణంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

– జి.సత్యనారాయణ, జిల్లా హౌసింగ్‌ ప్రాజెక్టు డైరక్టర్‌

Updated Date - Sep 18 , 2025 | 12:56 AM