పట్టాలిచ్చారు.. స్థలం మరిచారు!
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:54 AM
భూసేకరణ పూర్తి చేయ కుండానే పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలు ఇవ్వడం మరిచారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి దోసపాడులో 42 దళిత పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతు న్నాయి.
గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకం
దోసపాడులో 42 కుటుంబాల ఆవేదన
పంచాయతీ కార్యాలయంలో నిరసన
దెందులూరు, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి):భూసేకరణ పూర్తి చేయ కుండానే పట్టాలు ఇచ్చారు. కానీ స్థలాలు ఇవ్వడం మరిచారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకానికి దోసపాడులో 42 దళిత పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతు న్నాయి. వైసీపీ ప్రభుత్వం 2023లో ఇంటి స్థలం లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలం అందిస్తామని హడావుడి చేసి ఆన్ లైన్ చేసి ప్రచారం కోసం ఇళ్ల పట్టాలను 42 కుటుంబాలకు అందిం చారు. అయితే స్థలం ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాకా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఇంటి స్థలం కేటాయించేందుకు వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్‌లైన్ చేయ బోగా వీరు ఇప్పటికే స్థలాలు పొందినట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. ఈ నేపథ్యంలో బాధితులంతా సోమవారం పంచాయతీ కార్యాలయంలో నిరసనకు దిగారు. స్థానిక టీడీపీ నాయకులు అత్తులూరి శ్రీనివాస్, మేడూరి వెంకటేశ్వరావు, నెరుసు గంగరాజు, చంద్రశేఖర్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తామని తెలిపారు.