ఇంటిపన్నుల మ్యాపింగ్‌లో నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:15 AM
ఇంటిపన్నుల వసూళ్లలో పార దర్శకంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా స్వర్ణపంచాయతీ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం పంచాయ తీల పరిధిలోని పంచాయతీ పన్నులకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని పంచా యతీరాజ్ ఉన్నతాధికారులు గుర్తించారు.
అమరవరం పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ
ఏలూరుసిటీ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి):ఇంటిపన్నుల వసూళ్లలో పార దర్శకంగా వ్యవహరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నూతనంగా స్వర్ణపంచాయతీ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ప్రకారం పంచాయ తీల పరిధిలోని పంచాయతీ పన్నులకు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని పంచా యతీరాజ్ ఉన్నతాధికారులు గుర్తించారు. జిల్లాలో 547 పంచాయతీలుండగా స్వర్ణపంచాయతీ పోర్టల్‌లో పంచాయతీ పరిఽధిలోని ఇళ్లకు సంబంధించి పన్నుల వసూళ్లకు ఫోన్ నెంబర్‌తో మ్యాపింగ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. ప్రతి ఇంటికి పన్నులు చెల్లించిన వెంటనే సంబంధిత యజమాని ఫోన్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. ఒకవేళ పన్ను చెల్లించక పోయినా హెచ్చరిక మెస్సేజ్ వెళ్తుంది. కీలకమైన ఈ ఫోన్ నెంబర్ల మ్యాపింగ్‌లో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించారని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ విషయంలో ఆయా పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కునూరు మండలంలోని అమరవరం, పెదవేగి మండలంలోని కూచిం పూడి, ముసునూరు మండలంలోని ముసునూరు, టి.నరసాపురం మండలంలోని టి.నరసాపురం, చింతలపూడి మండలంలోని ప్రగడవరం పంచాయతీల్లో అధికంగా ఇళ్లకు ఒకే ఫోన్ నెంబర్ మ్యాపింగ్ అయినట్టు గుర్తించారు. ఈ విధంగా మ్యాపింగ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించి కుక్కునూరు మండలం అమరవరం పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా, మిగిలిన నలుగురు పంచాయతీల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు డీపీవో కె.అనురాధ తెలిపారు.