Share News

ఇల్లు కట్టేదెలా..?

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:12 AM

వైసీపీ ప్రభుత్వ పాలనలో శివారు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటికీ పూడిక చేపట్టలేదు.

ఇల్లు కట్టేదెలా..?

నిర్మాణం చేపడతారా.. లేదా..?

లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ తాఖీదు

శివారు లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణం ఎలా?

ఎటూ తేల్చుకోలేని ఇళ్ల లబ్ధిదారులు

రాయితీ పెంచినా నిరాసక్తత

వైసీపీ ప్రభుత్వ పాలనలో శివారు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటికీ పూడిక చేపట్టలేదు. మరోవైపు గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇళ్లు కడతారా.. లేదా..? అంటూ నోటీసులు ఇవ్వడానికి సమాయత్తం అయ్యారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ప్రధానమంత్రి ఆవాస యోజనలో గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు లబ్ధిదారులకు శాపంగా మారాయి. పట్టణాలకు దూరంగా, లోతట్టు ప్రాంతాల్లో సెంటు స్థలాన్ని కేటాయించారు. ఇప్పటికీ కొన్ని లేఅవుట్‌లను పూడిక చేపట్టలేదు. లబ్ధిదారు లకు కేటాయించిన స్థలాలు ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేవని ఆసక్తి చూపడం లేదు.

లబ్ధిదారు ఇల్లు నిర్మించుకోవాలంటే కనిష్ఠంగా రూ. 5 లక్షలు వ్యయం అవుతుంది. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మాత్రమే ఇస్తోంది. కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, బీసీ కేటగిరీ లబ్ధిదా రులకు అదనంగా రూ. 50 వేలు పెంచారు. ఎస్టీలకు రూ.75వేలు అదనపు రాయితీ ప్రకటించింది. అయినా లబ్ధిదారుల్లో చలనం లేదు. ఇళ్లు నిర్మించుకోలేమన్న ఉద్దేశంతో ముఖం చాటేస్తున్నారు. ఇటీవల సచివాల యాల సిబ్బంది వివరాలు సేకరించారు. నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించారు. నిర్మాణా లు చేపట్టకపోడానికి కారణాలను అడిగి తెలుసు కున్నారు. లిఖితపూర్వకంగా మరోసారి లబ్ధిదా రుల కు నోటీసులు ఇవ్వనున్నారు. నిర్మాణాలు చేపట్ట కుంటే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆసక్తి చూపని లబ్ధిదారులు స్థలాలను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

20 వేల మంది వెనకడుగు

జిల్లాలో ఇళ్లు కట్టుకోలేని లబ్ధిదారులు 20వేల మంది ఉన్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి ఆవాస యోజనలో 72 వేల ఇళ్లు మంజూరయ్యాయి. కాంట్రా క్టర్లు దాదాపు 11వేల ఇళ్లు నిర్మించాల్సి ఉంది. మరో 20 వేల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. భీమవరం, తణుకు లేఅవుట్‌లలో ప్రభు త్వం ఇప్పటి వరకు పూడిక చేపట్టలేదు. ఇదికూడా లబ్ధిదారులు వెనుకంజకు కారణమైంది. మరోవైపు తణుకు పట్టణంలో లబ్ధిదారులకు ఏడు కిలోమీటర్ల దూరంలోని లోతట్టు భూముల్లో స్థలాలు ఇచ్చారు. దాంతో పెద్ద మొత్తంలో వెచ్చించి నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు.

పిట్టగూడులా ఇళ్లు

పట్టణ ప్రాంత లబ్ధిదారులకు సమీప పల్లెల్లో సెంటు స్థలం కేటాయించారు. పిట్టగూడుల్లా ఇళ్లు నిర్మించుకోవాల్సి వస్తోంది. దాంతో కొందరు లబ్ధిదారు లు తమ స్థలాలను ఇతరులకు విక్రయించేశారు. దళారులు మధ్యవర్తులుగా ఉన్నారు. లబ్ధిదారుని పేరుతో ఇళ్లు ఉన్నా ఇతరులకు ఇల్లు వెళ్లిపోయింది. ఇంకొందరు నిర్మాణానికి సొమ్ము లేదని వెనుకడుగు వేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ రాయితీని రూ.2.30 లక్షలకు పెంచింది. ఎస్‌సి, బీసీలకు మాత్ర మే వర్తింపజేసింది. అగ్రకులాల్లో పేదలకు అది కూడా లేదు. రాయితీ పెంచినా సరే ఇళ్ల నిర్మాణానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాంతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ లబ్ధిదారులకు నోటీసులు జారీచేసేందుకు సిద్ధమవుతోంది,

Updated Date - Jun 09 , 2025 | 12:12 AM