భోజనం ఎలా వుంది ?
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:25 AM
భోజనం ఎలా వుంది ? పదార్థా లన్నీ రుచిగా వుంటున్నాయా ? మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా ? లేదా’ అంటూ జిల్లా కలె క్టర్ వెట్రిసెల్వి ఏలూరు అశోక్‌నగర్‌లోని కె.పి.డి. టి. హైస్కూలు విద్యార్థినులను ప్రశ్నించారు.
విద్యార్థినులను ప్రశ్నించిన కలెక్టర్
ఏలూరు అర్బన్/ ఏలూరు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):‘భోజనం ఎలా వుంది ? పదార్థా లన్నీ రుచిగా వుంటున్నాయా ? మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా ? లేదా’ అంటూ జిల్లా కలె క్టర్ వెట్రిసెల్వి ఏలూరు అశోక్‌నగర్‌లోని కె.పి.డి. టి. హైస్కూలు విద్యార్థినులను ప్రశ్నించారు. శనివారం ఆమె స్కూలును ఆకస్మికంగా సందర్శిం చారు. విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్థాల నాణ్యతను భుజించి పరిశీలించారు. బాగాలేకుంటే చెప్పాలని చిన్నారులను కోరారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు తగిన సంఖ్యలో బిగించాలని డీఈవో వెం కట లక్ష్మమ్మకు ఆదేశాలు జారీ చేశారు. 8వ తర గతి గదిలోకి వెళ్లి ఇంగ్లీషు పాఠ్యాంశాన్ని చదవా ల్సిందిగా విద్యార్థినులను కోరగా సరిగా చదవలేక పోవడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠాలు అర్థమయ్యేలా బోధించాలని హితవు పలికారు. అలాగే భోజన పథకం పర్య వేక్షణ, నాణ్యతలో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా కలె క్టరేట్‌లో వ్యక్తిగత, సమాజ పరిశ్రుభత కార్యక్రమంలో పలు విభాగాల్లో చెత్తా, చెదారాలను తొలగించి, మొక్క లు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి చేప ట్టారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తామని ప్రతిజ్ఞ చేయించారు.