Share News

సారూ..ఇటు చూడరూ !

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:21 AM

అసలే చలికాలం.. మరోపక్క ఇటీవల చలిగాలులు వణికిస్తున్నాయి.

సారూ..ఇటు చూడరూ !
తణుకు బీసీ బాలుర వసతి గృహంలో నేలపై పడుకున్న విద్యార్థులు

వసతి గృహాల్లో వణుకుతున్న విద్యార్థులు

ఇరగవరం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : అసలే చలికాలం.. మరోపక్క ఇటీవల చలిగాలులు వణికిస్తున్నాయి. తలుపులు బిగించుకున్నా ఇంట్లోకి చలి చొచ్చుకొస్తోంది..ఇలాంటి పరిస్థితుల్లో తలుపులే లేని గదుల్లో విద్యార్థులు ఎలా ఉండగలరు.. చలితో గజగజ వణికిపోరూ ? తణుకు పట్టణంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో రాత్రి పూట విద్యార్థులు చలితో వణికిపోతున్నారు. పలుచోట్ల విద్యార్థులు నేలపైనే నిద్రించాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహంలో 50 మంది విద్యార్థులు ఉండగా వీరిలో సగం మందికి దుప్పట్లు, చాపలు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకుని వాడుకుంటున్నారు. పైడిపర్రు సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల వసతి గృహంలో 52 మంది వసతి పొందుతున్నారు. ఇక్కడ ఉన్న గదులకు తలుపులు పాడైపోవ డంతో తీసేశారు. కానీ కొత్తవి ఏర్పాటు చేయకపోడంతో చలిగాలికి విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లను అడ్డుగా కట్టుకుని పడుకుంటున్నారు. అధికారులు ఒక్కసారి ఇటు చూడాలని కోరుతున్నారు.

Updated Date - Dec 20 , 2025 | 12:21 AM