స్థానికంగా... ఉండాల్సిందే!
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:33 AM
హాస్టళ్లలో ఉండే విద్యార్థులపై పర్యవేక్షణ, రక్షణ కోసం స్థానికంగా హాస్టల్ ఉండే ప్రాంతంలో వార్డెన్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు నివాసం ఉండాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి విధులు నిర్వహిస్తున్నార్న ఆరోపణలు, విమర్శలతో ఈ చర్యలకు ఉపక్ర మించింది.
వసతి గృహాల్లోని వార్డెన్లు, వెల్ఫేర్ ఆఫీసర్లకు ఆదేశాలు
విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
వసతి గృహాల్లో పెరగనున్న ఆహార నాణ్యత
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
హాస్టళ్లలో ఉండే విద్యార్థులపై పర్యవేక్షణ, రక్షణ కోసం స్థానికంగా హాస్టల్ ఉండే ప్రాంతంలో వార్డెన్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు నివాసం ఉండాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి విధులు నిర్వహిస్తున్నార్న ఆరోపణలు, విమర్శలతో ఈ చర్యలకు ఉపక్ర మించింది.
వసతి గృహాల్లోని విద్యార్థుల భద్రతకు కూటమి ప్రభు త్వం పెద్దపీట వేస్తోంది. అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో వివిధ రూపాల్లో తనిఖీలకు ఆదేశించింది. ఒక పక్క కలెక్టర్లు, మరో పక్క వివిధ కమిషన్ల సభ్యులు తనిఖీలతో వసతి సౌకర్యం మెరుగుపడింది. ఈ ఆర్థిక సంవత్సరం ముందే మౌలిక సదుపాయాలు, ఇతర మర మ్మతులు చేయించిన ప్రభుత్వం.. ఇటీవల ముఖ ఆఽధా రితంగానే ఆహారం అందిస్తోంది. జిల్లాలో 32 బీసీ వసతి గృహాల్లో మూడువేల మంది విద్యార్థిని, విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఇటీవలే విద్యార్థుల ముఖచిత్ర హాజరు విధానం (ఎఫ్‌ఆర్‌ఎస్)ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో కొం దరు హెచ్‌డబ్ల్యువోలు సహాయ సిబ్బందితో హాజరు నమో దు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. హాస్టల్ వార్డెన్లు 32 మందికి 11 పోస్టులు ఖాళీగా ఉండగా, ఇన్ చార్జ్‌లతో కొన్ని గృహాలు నడుస్తున్నాయి.
విద్యార్థుల సంక్షేమం, భద్రతను చూడాల్సిన హెచ్‌డబ్ల్యు వోలు, ప్రధానాచార్యులు స్థానికంగా నివాసం ఉండకపోవ డంతో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో హాస్టళ్లలో ఉండి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరుకులు సిబ్బందికి ఇచ్చి ఆహారం, కూరలను సిద్ధం చేయించాల్సి ఉం డగా, ఎక్కువ మంది సరుకులను ముందురోజే ఇచ్చి తర్వాత తాపీగా వస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. సహా య సిబ్బంది సరుకులు దారి మళ్లించి అరకొరగా వండు తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. ఎంతమంది ముఖ హాజరు నమోదు చేస్తే అంతమందికి ఆహారం, వంటకాలు తయారు చేసి అందిస్తారు. వసతిగృహాల్లో క్వారర్టు ఉంటే అక్కడ ఉండాలని.. లేకపోతే ఆ గ్రామ పరిధిలోనే నివాసం ఖచ్చితంగా ఉండి తీరాలని ఆదేశించింది.
దాదాపు అందరూ ఉంటున్నారు..
ఇటీవలే అన్ని వసతి గృహాలను తనిఖీ చేశాం. పనిచేసే వార్డెన్లు, సహాయకులు ఉండాలని ఆదేశిం చాం. దాదాపుగా అందరూ స్థానికంగా ఉంటున్నారు. వారి నివాసాలనూ నేను తనిఖీ చేసి వచ్చా.. ఎవరైనా స్థానికంగా ఉండడం లేదంటే ఫిర్యాదు చేయవచ్చు.
– ఆర్‌వీ నాగరాణి, బీసీ వెల్పేర్ ఆఫీసర్