Share News

జీతాలు చెల్లించండి మహాప్రభో

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:51 PM

జిల్లాలోని ప్రభుత్వాసుపత్రు లలో పారిశుధ్య కార్మికులకు మూడు నెలలు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.

జీతాలు చెల్లించండి మహాప్రభో
జంగారెడ్డిగూడెం ఆసుపత్రి వద్ద ధర్నా చేస్తున్న పారిశుధ్య కార్మికులు

ప్రభుత్వాస్పత్రి పారిశుధ్య కార్మికుల ధర్నా

ఏలూరు క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులలో పారిశుధ్య కార్మికులకు మూడు నెలలు జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. 18 నెలల పీఎఫ్‌ బకాయి కూడా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు మంగళవారం విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టారు. జిల్లాలోని బుట్టా యగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం, చింతలపూడి, నూజివీడు, భీమడో లు, దెందులూరు, కైకలూరు ఆస్పత్రులలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. పండుగ వేళ కూడా తమ కుటుంబాలతో ఆకలితో ఉండాలా అం టూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫస్ట్‌ అబ్‌జెస్ట్‌ ప్రైవేట్‌, ఫస్ట్‌ అబ్‌బెస్ట్‌ ఏజెన్సీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ రెండు ఏజెన్సీల వివాదంతో కార్మికుల జీతాలు నిలిపి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. జిల్లా అధ్యక్షుడు కె.కృష్ణమాచార్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ పలువురు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 11:51 PM