Share News

ఉద్యాన వర్సిటీలో ర్యాంకుల పంట

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:52 PM

ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వ విద్యాలయ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు.

ఉద్యాన వర్సిటీలో ర్యాంకుల పంట
అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సంపతరావును సత్కరిస్తున్న డీన్‌, అధ్యాపకులు

ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయి ర్యాంకులు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షలో వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వ విద్యాలయ విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. ఎమ్మెస్సీ కోర్సుల ప్రవేశానికి జాతీయ వ్యవసాయ పరిశోఽధనా మండలి (ఐసీఏఆర్‌) నిర్వహించిన పరీక్షల్లో రికార్డు స్థాయిలో ర్యాంకులు రావడం అభినందనీయమని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయ డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ ఎస్‌.సూర్యకుమారి అన్నారు. తాడేపల్లి గూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన కళాశాల విద్యార్థులు ఇటీవల ఐసీఏఆర్‌ నిర్వహించిన ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన పి.జ్యోతిర్మయి (ఉద్యాన శాస్త్రం) 5వ ర్యాంకు, ఎ.గంగాప్రసాద్‌ (ఫిజికల్‌ సైన్స్‌) 14వ ర్యాంకు, ఎ.వీర సూర్యపవన్‌ (ప్లాంట్‌ సైన్స్‌)తోపాటు జాతీయ స్థాయిలో 50 లోపు 3 ర్యాంకులు, 500 లోపు 13 ర్యాంకులు, వెయ్యిలోపు 37 ర్యాంకులు సాధించిన విద్యార్థులను సూర్య కుమారి, అధ్యాపకులు అభినందించారు. విద్యార్థులు ఇంతటి ఘనత సాధించేం దుకు కృషిచేసిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.సంపతరావును సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఏవీడీ దొరాజీ, బోధన, భోదనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:52 PM