ఆశలు.. ఆకాంక్షలు
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:48 AM
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై గళ మెత్తేందుకు సిద్ధం అవుతున్నారు.
జిల్లాలో అపరిష్కృత సమస్యలెన్నో..
గళం వినిపించేందుకు ఎమ్మెల్యేలు సన్నద్దం
ఏలూరు,సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై గళ మెత్తేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ పథకాలను విజయవంతం చేసినా.. ఇంకా చాలా నియోజక వర్గాల్లో నిధుల్లేమి.. రైతుల సమస్యలు. టిడ్కో ఇళ్లకు మోక్షం లభించక పోవడం, మంచినీటి వనరులు, ఎన్టీఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై తమ వాణి వినిపించడానికి ఎమ్మెల్యేలు తమ లెక్కలు, వివిధ ప్రతిపాదిత అంచనాలతో అసెంబ్లీలోకి అడుగు పెట్టను న్నారు. కొల్లేరు కాంటూరు, ఇరిగేషన్ పథకాలు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు, ఆక్వా రంగంలో ఒడిదుడుకులు తదితర సమ స్యలపై ఎమ్మెల్యేలు తమ వాణిని విన్పిస్తారని జిల్లావాసులు ఆశాభావంతో ఉన్నారు.
ఆయిల్‌పామ్ బోర్డు కోసం..
చింతలపూడి నియో జకవర్గంలో మూడు ఆయిల్ ఫ్యాక్టరీలున్నాయి. 50 వేల ఎకరాల పామా యిల్ సాగవుతుంది. రైతులకు సత్వరం న్యాయం జరిగేలా ఇక్కడ ఆయిల్ పామ్ బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తాను. పలుచోట్ల పంట కాల్వల వల్ల మార్జిన్లు దెబ్బతింటు న్నాయి. దీనికి పరి ష్కారానికి చట్టం తేవాలని విన్నవిస్తా. ఆర్ అండ్‌బీలో ఇంజనీర్ల కొరత తీర్చాలి. చింతల పూడి నగర పంచాయతీగా ప్రకటిం చినా.. పాలకవర్గం లేదు. కనీసం నిధులైన విడుదల చేయాలని సభలో కోరుతాను.
– సొంగా రోషన్‌కుమార్, చింతలపూడి ఎమ్మెల్యే
వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు నిధులు కోరతా..
నియోజకవర్గంలో ప్రధాన వంతెనలైన నారాయణపురం, గణపవరం వంతెనలు శిఽథిలావస్థకు చేరడంతో వాటి పునర్నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని విన్నవిస్తాను. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు, పునర్నిర్మా ణానికి నిధుల మంజూరు చేయడానికి కృషి చేస్తాను. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి నివేదిస్తాను.
– పత్సమట్ల ధర్మరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే
టిడ్కో ఇళ్లపై ప్రస్తావిస్తా..
గతంలో 4,400 ఇళ్లకు టిడ్కో పఽథకంలో రూ.25 వేల డీడీలు తీసిన వారికి ఆయా మొత్తాలు తిరిగి వెనక్కి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరతాను. ప్రధానమైన ఏలూరు ఎన్‌ఆర్‌పేట వద్ద ఓవర్‌బ్రిడ్జి పునరుద్ధ్దరణకు రూ.రెండు కోట్ల ప్రతిపాదన ఏ దశలో ఉందో అడుగుతాను. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ కాలనీలో పూర్తి చేసిన మూడువేల ఇళ్లల్లో గృహా ప్రవేశాలకు అనువుగా మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరుకు విన్నవిస్తాను. రూ.15 కోట్లతో శనివారపుపేట వద్ద కాజ్‌వేపై వంతెనను త్వరలో చేపట్టాలని, అమృత్ 2.0 పథకం కింద ప్రతీ ఇంటికి గోదావరి నీటిని పైపులైన్లు విస్తరణ చేయాలని, పుట్టుకతోనే మంచంపైనే ఉన్న దివ్యాంగులకు రూ.10వేలు ఇస్తే వారికి సహాయకులు సేవ చేయడానికి వీలుంటుందని సభ దృష్టికి తీసుకెళ్లతా.
– బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు ఎమ్మెల్యే