అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:38 AM
అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సుపరి పాలనలో తొలి అడుగు, ఇంటింటా ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే సొంగా రోష
హోం మంత్రి అనిత
చింతలపూడి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో లింగపాలెం, చింతలపూడి మండలాల్లో సుపరి పాలనలో తొలి అడుగు, ఇంటింటా ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు, అభి మానులు ఘన స్వాగతం పలికారు. ఫాతిమా పురం, అంథోని నగర్‌లలో ప్రజలతో మాట్లా డారు. ఆంథోనినగర్‌లో కోటమ్మ అనే దళిత వృద్ధురాలు తన కన్ను కనపడడం లేదని, ఆపరేషన్ చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడంతో ఆపరేషన్ చేయి స్తామని ఎమ్మెల్యే రోషన్‌కుమార్ బాధ్యత తీసుకుంటారని భరోసా ఇచ్చారు. కాలనీ లోని మేరీమాత విగ్రహానికి పూలమాల వేశారు. పలు ఇళ్లకు వెళ్లి సంక్షేమ పథ కాలు అందుతున్నాయా.. లేదా అంటూ ఆరా తీశారు. అనంతరం స్థానిక ఆర్‌కే ఫంక్షన్ హాలులో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ అర్హులైన రైతులందరి అకౌంట్లలో అన్నదాత సుఖీభవ సొమ్ములు జమ అవుతాయని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కాబోతుందన్నారు. నియోజకవర్గం లో ఏడాది పాలనలోనే ఎమ్మెల్యే రోషన్‌కుమార్ 150 కోట్లతో వివిధ పథకాలు సిద్ధం చేశారని, కొన్ని చోట్ల రోడ్లు గుంతల సమస్యలు ఉన్నాయని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తారన్నారు. నియోజకవర్గ పరిశీలకులు కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ నాయకులు దోచిన సొమ్ము ప్రజలకు చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఏడాది సుపరిపాలన ప్రజలకు అందుతుందో, లేదో తెలుసుకోవాలన్న లక్ష్యమే ఇంటింటా ప్రచారమన్నారు. ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ కూటమి పాలన ఎంతో బాగుందని ప్రజలు తెలుసుకోవాల న్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి చంద్రశేషు మాట్లాడుతూ ఏడాది సుపరిపాలన గురించి గత ప్రభుత్వంలో జంగారెడ్డిగూడెంలో 2022లో జరిగిన సారా మరణాలపై వివరించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా ఈశ్వరయ్య మాట్లాడుతూ జగన్‌కు 11 సీట్లు ఇచ్చినా అవి కూడా నిలబెట్టుకునేలా లేరన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ కిశోర్, జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ సుపరిపాలన కూటమి లక్ష్యమన్నారు. బొబ్బర రాజపాల్, జగ్గవరపు ముత్తారెడ్డి పలువురు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గం నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.