Share News

కూటమి పాలనలో ప్రశాంతత

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:42 AM

కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

కూటమి పాలనలో ప్రశాంతత
ఆకివీడులో పసి పాపను ఎత్తుకున్న హోం మంత్రి అనిత

ఆకివీడు, జూలై 28(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న మంత్రి వెలంపేటలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిప్యూటీ స్పీకర్‌ రామకృష్ణరాజు నియోజకవర్గంలో చేపడుతున్న అభి వృద్ధి కార్యక్రమాలు అమోఘమన్నారు. డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేసి ఎన్టీఆర్‌ వైద్యసేవ అనుసంధానం చేసే ప్రయత్నాలు చేయడం అభినందనీయమన్నారు. పోలీస్‌ సిబ్బందికి కొత్త వాహనాలు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. నేరాలు నియంతణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం మంచిపని అన్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే పోలీసులు ముందుగా సీసీ కెమెరాలు చూస్తారన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి మంత్రులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పని చేస్తున్నారన్నా రు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి మాటే మరచారన్నారు. పదో తరగతి విద్యార్థినికి వెలంపేట కోదండ రామాలయ అభివృద్ధి కమిటీ రూ.25 వేల చెక్కును హోం మంత్రి అనిత ద్వారా అందజేశారు. మహిళా పోలీసుల శక్తి యాప్‌ను వనిత పునఃప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్‌ బొల్లా వెంకట్రావు, టీడీపీ నేతలు మోటుపల్లి రామ వరప్రసాద్‌, గంధం ఉమా, గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు, గొంట్లా గణపతి, అల్లు సాంబ, నౌకట్ల రామారావు, కౌన్సిలర్లు బొల్లా వీరశ్వేత, బత్తుల శ్యామల, మోపిదేవి సత్యవతి, బొర్రా సుజాత, బచ్చు సరళాకుమారి పాల్గొన్నారు.

హోం మంత్రి అనితకు ఘనస్వాగతం

ఆకివీడు రూరల్‌: ఆకివీడు పర్యటనకు వచ్చిన హోం మంత్రి అనితకు ఉప్పుటేరు వద్ద జిల్లా టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంతెన రామరాజు, కనుమూరు భరత్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

Updated Date - Jul 29 , 2025 | 12:42 AM