Share News

ఎండ మండే

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:30 AM

ఈ ఏడాది మే నెల వర్షాలు, మబ్బులతో గడిచింది. ఎండ ప్రభావం పెద్దగా లేదు.

ఎండ మండే
తాడేపల్లిగూడెం మాధవరంలో ముసుగు ప్రయాణం

భానుడి ప్రతాపం.. ఉక్కబోతతో విలవిల

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏలూరు సిటీ, జూన్‌2 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మే నెల వర్షాలు, మబ్బులతో గడిచింది. ఎండ ప్రభావం పెద్దగా లేదు. నెలాఖరులో రోహిణి కార్తె ఆరంభమైనా వాతావరణం చల్లగానే ఉంది. జూన్‌ ఆరంభం మాత్రం సెగలు రేపింది. ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా భానుడు ప్రతాపం చూపుతు న్నాడు. ఉమ్మడి జిల్లాలో సోమవారం 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి ఆఖరులో సూర్య ప్రతాపానికి ప్రజలు అల్లాడు తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎండ ప్రభావంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్న సమయంలో దుకాణాలు మూసి వేశారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ వేడిగాలులతో కంటినిండ నిద్ర ఉండడంలేదని జనం వాపోతున్నారు. పాలకొల్లు పట్టణం జన సంచారం లేక బోసిపోయింది. తాడేపల్లిగూ డెం పట్టణం, పెంటపాడు ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఏలూరు నగరంతో పాటు జిల్లాలో ఉష్ణోగ్రత తీవ్రస్థాయిలో ఉండ డంతో ప్రజలు బయటకు రావడానికి భయప డుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహ నాలలో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. మరోవైపు అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యుత్‌ కోతలు లేదని అధికారులు చెబుతున్నా చాలా ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలుగు తోంది. ముదినేపల్లి – గుడివాడ, కైకలూరు జాతీ య రహదారులు, నిత్యం రద్దీగా ఉండే గురజ రోడ్డు సెంటర్‌లో జన సంచారం లేదు. పోల వరంలో మెయిన్‌ రోడ్‌, బజారులో జన సంచా రం లేక బంద్‌ వాతావరణాన్ని తలపించాయి.

Updated Date - Jun 03 , 2025 | 12:30 AM