కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:09 AM
న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి కేసులు పెండింగ్ లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ డాక్టర్ వీఆర్‌కే కృపాసాగర్‌లు సూచించారు.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మన్మథరావు, జస్టిస్ డాక్టర్ కృపాసాగర్
ఏలూరు క్రైం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి) : న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి కేసులు పెండింగ్ లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ డాక్టర్ వీఆర్‌కే కృపాసాగర్‌లు సూచించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో పనిచేస్తున్న న్యాయమూర్తులకు ఏలూరు జిల్లా కోర్టు కాన్ఫరెన్సుహాలులో నూతన చట్టాలపై శనివారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపై న్యాయమూర్తులు నైపుణ్యం పెంచుకో వాలన్నారు. వర్క్‌షాపుల ద్వారా కొత్తకొత్త విషయాలను తెలుసుకోవడం వల్ల కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి దోహదపడతాయన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిరిపురం శ్రీదేవి మాట్లాడుతూ 2025లో మొదటి వర్క్‌షాపు నిర్వహిస్తున్నామన్నారు. అనుభవజ్ఞులైన న్యాయమూర్తుల చేత ఇటు వంటి శిక్షణ తరగతులు నిర్వహించడం వల్ల జూనియర్ న్యాయ మూర్తులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విశ్రాంతి జిల్లా న్యాయ మూర్తి, రిసోర్స్ పర్సన్ వైవీ రామకృష్ణ, అదనపు జిల్లా జడ్జి ఎం.రామ కృష్ణంరాజు, న్యాయమూర్తులు, పలువురు పాల్గొన్నారు.