హై అలర్ట్..!
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:09 AM
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎటువంటి నష్టం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, జిల్లా తుఫాన్ పర్యవేక్షణ ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే, తుఫాన్ పర్యవేక్షక జోనల్ ప్రత్యేకాధికారి ఆర్‌పి సిసోడియా, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్ ముందస్తు సహాయక చర్యలపై సమీక్షించారు.
మొంథా తుఫాన్ దిశపై కలవరం
ఈ రాత్రి గడిస్తే చాలు..
భయం గుప్పిట్లో ప్రజలు, రైతులు
11 లంక గ్రామాల్లో 82 తుఫాను సహాయక కేంద్రాలు ఏర్పాటు
జిల్లాకు చేరిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు
అధికారులు, మంత్రుల సమీక్ష
తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎటువంటి నష్టం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, జిల్లా తుఫాన్ పర్యవేక్షణ ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే, తుఫాన్ పర్యవేక్షక జోనల్ ప్రత్యేకాధికారి ఆర్‌పి సిసోడియా, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్ ముందస్తు సహాయక చర్యలపై సమీక్షించారు. వివిధ శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు, వాగులు, కాల్వల వద్ద భద్రత, ఎస్‌డీఆర్‌ఎఫ్ బలగాలు, పోలీస్ పికెట్లుపై సర్వసన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఏలూరు/ ఏలూరు సిటీ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ఎటువంటి నష్టం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కల్వర్టులు, కాజ్‌వే లు వద్ద ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తహసీల్దార్లు, ఇతర అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నుంచి తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న కోణంలోనే ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు చెందిన 25 మంది జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఒక ఎస్‌ఐ పర్యవేక్షణలో 13 మందిని కొల్లేరు పరీవాహక ప్రాం తమైన కైకలూరు నియోజకవర్గానికి తరలించారు. గిరిజన భవన్‌లో 12 మంది రిజర్వ్‌లో ఉంచారు. ఏలూరు నగరం, నూజివీడు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో లోతట్టు ప్రాంతా ల్లో వరద నీరు నిలిచిపోకుండా కట్టలు, చెట్లను తొలగించ డానికి ప్రత్యేకంగా ఎక్సకవేటర్లు సిద్ధం చేశారు. ప్రధాన డ్రెయిన్లు, కాల్వలు, చెరువుల వద్ద వరదనీటి ప్రవాహానికి అడ్డంకులను అధికారులు పర్యవేక్షణలో తొలగించారు. చెరు వులు, వాగులు పరిసర ప్రాంతాల్లో కట్టలు తెగిపోకుండా 3వేల ఇసుక బస్తాలను జలవనరుల శాఖ సిద్ధం చేసింది. కలెక్టరేట్, నూజివీడు సబ్ కలెక్టరేట్, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షణకు సిబ్బందిని నియమించారు.
కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద జాగ్రత్త
తుఫాను వేళ ప్రజలు కాజ్‌వేలు, కల్వర్టులు దాటకుండా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్ర టరి, తుఫాన్ పర్యవేక్షక జోనల్ ప్రత్యేకాధికారి ఆర్‌పి సిసో డియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో తుఫాన్ ముందస్తు చర్యలపై జిల్లా ప్రత్యేకాధికారి కాంతిలాల్ దండే, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడతో కలిసి అధికారుల తో సమీక్షించారు. తుఫాను మంగళవారం తీరం దాటే అవ కాశం ఉన్నందున తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని, ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసు కోవాలన్నారు. జిల్లాలో 11 లంక గ్రామాలు తుపాన్ ప్రభా విత ప్రాంతాలుగా గుర్తించామని, 82 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆహారం, వైద్య, తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. తుఫాన్ సహాయక కేంద్రాలలో భోజన, వసతి, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు.
తీరం దాటే సమయంలో గాలులు
తుఫాన్ మంగళవారం తీరం దాటవచ్చని వాతావరణ శాఖ సూచించిందని, తీవ్రమైన వేగంతో గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యే కాధికారి కాంతిలాల్ దండే అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 301 మైనర్ ఇరిగేషన్ చెరువులు సమస్యాత్మకం కాగా 129 మైనర్ ఇరిగేషన్ చెరువులు ప్రమాదకరమైనవిగా గుర్తించా మన్నారు. ప్రమా దానికి మించిన నీటి ప్రవాహం వస్తే గండి కొట్టే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 763 హోర్డింగ్‌లు తొలగించామని, వంద మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచామన్నారు. 123 మంది గర్భిణులను ప్రభుత్వాస్పత్రులకు తరలించామన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో ని 13 మండలాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 14 మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించామన్నారు. తుపాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.
తుఫాన్ సహాయక చర్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్షించారు. తుపాన్ ముగిసే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాన్ సహాయక కేంద్రాలలో భోజన, వసతి సదుపాయాలు సక్రమంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.