Share News

బోనాలు మోసిన హీరోయిన్‌ చాందిని చౌదరి

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:25 AM

‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం హీరో విక్రాంత్‌, హీరోయిన్‌ చాందిని చౌదరి ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతరలో సందడి చేశారు.

 బోనాలు మోసిన హీరోయిన్‌ చాందిని చౌదరి

ఏలూరు రూరల్‌,నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం హీరో విక్రాంత్‌, హీరోయిన్‌ చాందిని చౌదరి ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతరలో సందడి చేశారు. మేడలో కొలువై ఉన్న, పోతురాజు బాబు, వార్లను గంగా నమ్మ, మహాలక్ష్మీ అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆరాధించారు. చాందిని చౌదరి బోనాలు మోసి, కోలాటం ఆడి ఉత్సాహ పరిచారు. ఏలూరు వచ్చి గంగానమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు వారిద్దరూ తెలిపారు.

Updated Date - Nov 17 , 2025 | 12:25 AM