Share News

ఉప్పొంగుతున్న కొల్లేరు

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:52 AM

కొల్లేరు ఉప్పొంగుతోంది. ఇటీవల ముంపుతో అతలాకుతల మైన కొల్లేరు తీర ప్రాంతాల వారు తేరుకోక ముందే మళ్లీ వరద ముంపు పొంచి వచ్చింది.

ఉప్పొంగుతున్న కొల్లేరు
పెద్దఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డును ముంచిన కొల్లేరు వరద

మండవల్లి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): కొల్లేరు ఉప్పొంగుతోంది. ఇటీవల ముంపుతో అతలాకుతల మైన కొల్లేరు తీర ప్రాంతాల వారు తేరుకోక ముందే మళ్లీ వరద ముంపు పొంచి వచ్చింది. ఇప్పటికే పెద్ద ఎడ్లగాడి – పెనుమాకలంక రహదారిపై మూడు అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల తో ఒకేసారి ఎగువ నుంచి నీరు వచ్చి చేరడంతో కొల్లేరు ఉధృతంగా ప్రవహి స్తుంది. మరోపక్క పెద్దఎడ్ల గాడి వంతెనకు గుర్రపుడెక్క మేట వేయడంతో వరద నీరు దిగువకు వెళ్లడం లేదు. ఎగువ నుంచి వస్తున్న వరద నీరు లంక గ్రామాలకు చేరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెనుమాక లంక నుంచి నాటు పడవలపై పెద్దఎడ్లగాడి వరకు వచ్చి ఏలూరు కైకలూరు ప్రాంతాలకు వెళుతున్నా రు. వర్షాల నేపథ్యంలో గుర్రపుడెక్కను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు

ఏలూరు సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురు స్తూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో జనజీవనం స్తంభిస్తోంది. శనివారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడి ఒక్కసా రిగా భారీగానే వర్షాలు కురిశాయి. శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో భీమడోలులో భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా జీలుగుమిల్లి మండలంలో 45.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని సరాసరి వర్షపాతం 12.2 మిల్లీమీటర్లు నమోదు కాగా జిల్లాలో వర్షం కురిసిన మండలాల్లో వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. బుట్టాయిగూడెంలో 33, కలిదిండిలో 26.6, ఉంగుటూరులో 22.8, కుక్కునూరులో 20.4, పెదవేగిలో 20.2, కామవరపుకోటలో 19.2, నిడమర్రులో 17.8, వేలేరుపాడులో 17.2, జంగారెడ్డిగూడెంలో 14.6, ముదినేపల్లిలో 12.6, పెదపాడులో 11.8, దెందులూరులో 11, చింతలపూడిలో 10.2, లింగపాలెంలో 9.2, ఆగిరిపల్లిలో 7.2, ఏలూరు రూరల్‌లో 6.8, చాట్రాయిలో 6.2, భీమడోలులో 5, నూజివీడులో 3.8, ఏలూరు అర్బన్‌లో 3.6, పోలవరంలో 3.6, కైకలూరులో 3.2, ద్వారకాతిరుమలలో 2.8, ముసునూరులో 2.4, టి.నరసాపురంలో 2.2, మండవల్లిలో 1.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 26 , 2025 | 12:52 AM