ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎస్పీ, కలెక్టర్
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:24 AM
భీమవరం పట్టణంలోని పీపీ రోడ్డులో గురువారం ఒక వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
భీమవరంలో వస్త్ర దుకాణం ప్రారంభం.. ట్రాఫిక్ ఆంక్షలు
రాకపోకలు నిలిచిపోయి వాహనదారులకు ఇబ్బందులు
ఐదు గంటల పాటు రోడ్డుపై ఎండలో అవస్థలు
భీమవరం క్రైం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): భీమవరం పట్టణంలోని పీపీ రోడ్డులో గురువారం ఒక వస్త్ర దుకాణం ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బుల్లి తెర యాంకర్ రాక, వస్త్ర దుకాణ ఒక్కరోజు ఆఫర్‌తో జనం భారీగా ఎగబడ్డారు. పీపీ రోడ్డుపై కొనుగోలుదారులు బారులు తీరడంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మావుళ్లమ్మ గుడి రోడ్డు మీదుగా మళ్లించారు. దీనితో పట్టణంలో సుమారు ఐదు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడం, ఎండ తీవ్రతతో వాహనదారులు అవస్థలు పడ్డారు. అదే సమయంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, కలెక్టర్ సి.నాగరాణి వాహనాలు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. పోలీసు బొమ్మ సెంటర్, మావుళ్లమ్మ గుడి రోడ్డు, తాలూకా ఆఫీస్ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్, బాంబే స్వీట్ సెంటర్లలో అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో జిల్లా అధికారులకు సైతం తిప్పలు తప్పలేదు.