Share News

గోవిందా.. గోవిందా..

ABN , Publish Date - Aug 24 , 2025 | 11:54 PM

చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

గోవిందా.. గోవిందా..
చిన వెంకన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల ఆలయంలో భక్తుల రద్దీ

ద్వారకాతిరుమల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): చిన్న వెంకన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమావాస్య కావడంతో శనివారం భక్తుల రద్దీ బాగా తగ్గింది. ఆదివారం అందరికీ సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవస్థానంలోని అన్ని విభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండపై పార్కింగ్‌ ప్రాంతం కార్లు, ద్విచక్ర వాహనాలతో నిండింది. దాదాపు 15 వేల మంది ఆలయానికి వచ్చినట్లు అధికారుల అంచనా. శ్రీవారి ఉచిత దర్శనానికి 2గంటల పైబడి సమ యం పట్టింది. సాయంత్రం రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. దర్శనానం తరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

గుబ్బల మంగమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

బుట్టాయగూడెం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మన్యంలో అడవి బిడ్డల ఆరాధ్యదైవం గుబ్బల మంగమ్మను దర్శించుకోడానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి వేలాదిగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలా డింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా కమిటీ ఏర్పాట్లు చేసింది. మేఘాలు కమ్ముకోవడంతో భక్తులు త్వరితంగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Aug 24 , 2025 | 11:54 PM