Share News

కుండపోత

ABN , Publish Date - Aug 14 , 2025 | 01:00 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం జిల్లావ్యాప్తంగా కుండపో తగా వర్షాలు కురిశాయి.

కుండపోత
కాల్వలా మారిన గణపవరం–ఏలూరు రహదారి

జిల్లావ్యాప్తంగా స్తంభించిన జన జీవనం

బంగాళాఖాతంలో వాయుగండం.. నేడు, రేపు భారీ వర్షాలు

ఈదురుగాలులు.. తీరంలో ఎగసిపడుతున్న కెరటాలు

నీట మునిగిన రహదారులు.. రాకపోకలకు ఆటంకాలు

వెనుకస్తు సార్వా సాగుకు పొంచి ఉన్న గండం

భీమవరం టౌన్‌, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం జిల్లావ్యాప్తంగా కుండపో తగా వర్షాలు కురిశాయి. గురువారం నుంచి అల్పపీడన ద్రోణి బలపడి, వాయుగుండంగా మారే అవకాశాలు ఉండడంతో రాబోయే 48 గంటల్లో ఈదురు గాలులతోపాటు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరిస్తోం ది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మబ్బులు, మేఘాలు పట్టి రాత్రి 11 గంటల వరకు ఏకధాటిగా వర్షం కురిస్తూనే వుంది. ఈ కారణంగా పల్లపు ప్రాంతాలు జలమయం అ య్యాయి. డ్రెయిన్లలో నీరు రోడ్లపైకి చేరుతోంది. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షానికి విద్యుత్‌ సర ఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఉక్కబోత, ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజానీకానికి బుధవారం కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు. అయితే పాఠశాలల నుంచి పిల్లలు, ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరేందుకు ఇబ్బందులు పడ్డారు.

ఎగసిపడిన అలలు

నరసాపురం, మొగల్తూ రు మండలాల్లోని తీరంలో సముద్ర అలలు ఎగసిపడు తున్నాయి. బలమైన గాలు లతో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లలేదు. ఇప్పటికే వెళ్లిన బోట్లన్నీ వెనక్కి తిరిగి వచ్చాయి. తీర గ్రామాలైన పీఎం లంక, చినలంక, వేములదీవి, బియ్యపుతిప్ప, పేరుపాలెం, కేపీ పాలెం సము ద్రం నుంచి గాలులు బలంగా వీస్తుండటంతో గ్రామస్తులు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేదు. బీచ్‌లో సందర్శకులు లేక నిర్మానుషంగా మారింది. గాలులకు కరెంట్‌ వైర్లు, చెట్ల కొమ్మలు పడతాయన్న భయంతో ఆటోలు, వాహనాలు తిరగక రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

నీట మునిగిన చేలు.. రొయ్యలపై ఎఫెక్ట్‌

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా సార్వా రైతుల్లో కంగారు నెలకొంది. జిల్లాలో రెండు లక్షల పది వేల ఎకరాల్లో సార్వా సాగు చేస్తుండగా నాట్లు ప్రక్రియ దాదాపు పూర్తి కానుంది. వర్షాల వల్ల డెల్టాలోని ఈ నెల రెండో వారంలో వేసిన నాట్లకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ముం దస్తు నాట్లకు మెట్టలో సాగుకు వచ్చేలా ఉపయోగకరంగా ఉంటాయి. మొగల్తూరు మండలం లోని వంద ఎకరాల్లోని నారుమడులు నీట మున గడంతో రైతులు నీటిని బయటకు తోడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాతావరణం అతి శీతలంగా మారడంతో చేప లు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్‌ లోపంతో మత్య సంపద నశించిపోతుందని రైతులు ఆవేదన చెం దుతున్నారు.

రోడ్లు అధ్వానం.. ప్రయాణికుల పాట్లు

వర్షాలకు రోడ్లు అధ్వాన్నంగా మారాయి. మొగ ల్తూరు–వెంప, మొగల్తూరు రామాలయం–శేరేపా లెం, మరితిప్ప, పాతపాడు, కాళీపట్నం పడమర, తూర్పు, వారతిప్ప–వెంప రహదారులు గోతులతో ఉండటంతో వర్షం నీరు నిలిచింది. పల్లపు ప్రాం తాలైన మొగల్తూరు ఉన్నత పాఠశాల ఆవరణతో పాటు భవానీ కాలనీ, గుంటపల్లవపాలెం, నల్లం వారితోట ప్రాంతాల్లో డ్రెయిన్‌లు లాగక ముంపు లో ఉన్నాయి. గణపవరం–ఏలూరు రహదారిపై వర్షపు నీరు నదిలా పొంగుతోంది. అర గంటపా టు రాకపోకలు నిలిచాయి. గణపవరం–భువన పల్లి రహదారిపై మోకాలి లోతులో నీరు నిలిచిం ది. గణపవరం వైఎస్సార్‌ కాలనీ, ఇందిరమ్మ కాల నీ రహదారులు జలమయం అయ్యాయి. ఇరగవ రం, ఆకివీడులో డ్రెయినేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండడంతో రహదారులపైనే వర్షం నీరు నిలిచి పోయి పాదచారులకు, వాహనదారులకు ఇబ్బం దిగా మారింది. పెంటపాడు, ఆచంటలలో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. కచేరి సెంటర్‌ వద్ద చెరువును తలపించింది. పెనుగొం డ సంతకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. పాఠ శాలలు నుంచి ఇళ్ళకు వెళ్ళే విద్యార్థులు, మహిళ లు, ఇబ్బందులు పడ్డారు. అత్తిలి మండలం బల్లి పాడు, అత్తిలి, గుమ్మంపాడు, ఈడూరు ప్రాంతా ల్లోని పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ఇరగ వరంలో వ్యాపారాలు జోరుగా సాగే సమయంలో వర్షం కురవడంతో వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. తణుకు మండలంలోని పలు గ్రామాల్లోని వీధులలో వర్షపు నీరు నిలిచిపోయింది. తమ నివాసాల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. తాడేపల్లిగూడెంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లు, డ్రైన్లు తేడా లేకుండా వాగుల్లా నీరు ప్రవహించింది. రెండేళ్లలో ఇంతటి వర్షం చూడలేదని ప్రజలు చెబుతున్నారు. మసీదు సెంటర్‌ నుంచి ఓవర్‌ బ్రిడ్జి వరకు రోడ్డు కాలువను తలపించేలా మోకాలి లోతు నీరు చేరి వేగంగా ప్రవహించింది. యాగర్లపల్లి, వీకర్స్‌ కాలనీ, స్టేషన్‌రోడ్డు, కుమ్మరి పేట, పాతూరు వర్షం నీటితో జలదిగ్బంధంలో ఉంంది. మెయిన్‌రోడ్డు నీటితో నిండిపోయింది.

విద్యుత్‌ కంట్రోల్‌ రూమ్‌లు

ఏదైనా విద్యుత్‌ సమస్యలు వస్తే డివిజన్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నెంబర్లకు (భీమవరం 94931 77646, నరసాపురం 73820 50943, తాడేపల్లిగూడెం 94931 77806) ఫోన్‌ చేయాలని ఈ శాఖ ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912కు గానీ, సర్కిల్‌ కంట్రోల్‌ రూమ్‌ 94906 10152, డివిజన్‌ నెంబరు 94931 77646 నెంబర్‌కు తెలియజేయాలని కోరారు. తాడేపల్లిగూడెం టౌన్‌, రూరల్‌, పెంటపాడు, గణపవరం, అత్తిలి, ఇరగవరం, తణుకు, తేతలి సెక్షన్లలో ఏ విధమైన విద్యుత్‌ సమస్యవున్నా తాడేపల్లిగూడెం కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయాలని ఈఈ నరసింహారావు కోరారు.

భీమవరం మునిసిపాల్టీలో కంట్రోల్‌రూమ్‌

భీమవరం మునిసిపాల్టీలో కంట్రోల్‌ రూమ్‌ 08816–234284 నెంబరును ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల కారణంగా జిల్లాలో ప్రభుత్వ, ప్రైవే టు కళాశాలలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రా లకు గురువారం సెలవు ప్రకటించినట్టు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రకటించారు. ఆ ఆదేశాలు పాటించకుంటే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ ్చరికతో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పా టుచేశారు. సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉం టారు. అత్యవసర సేవలకు ప్రజలు 08816 299181 నెంబర్‌కు కాల్‌ చేయాలని కలెక్టర్‌ సూచించారు.

అధికారులకు సెలవులు రద్దు : కలెక్టర్‌

భారీ వర్షాల కారణంగా అధికారులంతా వచ్చే ఐదు రోజులు ప్రధాన కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అప్రమత్తం చేశారు. ఉద్యో గులు, సిబ్బందికి సెలవుల మంజూరును నిలిపివేశారు. నర్సాపురం, ఆచంట, మొగల్తూరు మండలాల్లో అధికారులు దృష్టి కేంద్రీకరిం చాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు. వర్షాల కారణంగా పైప్‌లైన్‌లు లీకేజీలను ఎప్పటికప్పుడు పరిశీలించి రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర మందులు, బ్లీచింగ్‌, క్లోరిన్‌ తదితర సామాగ్రి అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖకు దిశానిర్దేశం చేశారు. వర్షాలు తగ్గేంత వరకు జాగ్రత్తలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకు సూచనలు చేశారు.

Updated Date - Aug 14 , 2025 | 01:00 AM