Share News

జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:45 AM

బంగాళాఖాతం లో అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం జోరుగా వర్షాలు కురిశాయి.

జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం
పెదపాడులో నేలకొరిగిన వరి

ద్వారకాతిరుమల/పెదపాడు/కైకలూరు, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం జోరుగా వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో జనజీవనం స్థం భించింది. ఏలూరు నగరంతోపాటు కైకలూ రు నియోజకవర్గాలు, పెదపాడు, ద్వారకాతి రుమల, పెదవేగి, కామరపుకోట తదితర మండలాల్లో వర్షాలు కురిశాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల పలు చోట్ల విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగింది. ద్వారకాతిరుమలలో వర్షం దంచి కొట్టింది. ఉదయం ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి మధ్యాహ్నం వర్షం కురిసింది. తిరిగి సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆలయ పరిసరాలు, లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. పెదపాడు మండలంలో పలు గ్రామాల్లో ఈదరు గాలులు, భారీ వర్షంతో పలుచోట్ల వరి పంట నేలకొరిగింది. మండలంలో 15,800 ఎకరాల్లో స్వర్ణ, 1318 వరి రకాలు పొట్ట, ఈత దశలో ఉన్నాయి. కైకలూరు మండలంలో భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. రహదారులు కాలవలను తలపించాయి. డ్రెయిన్లు పొంగిపొర్లడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా మారాయి. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కైకలూరు కరకట్ట శివారు ప్రాంతంలో రహదారి అధ్వానంగా ఉండడంతో రెండు అడుగుల మేర నీరు నిలబడి ప్రజల రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు. జాతీయ రహదారి విస్తరణ పనులు నిర్వహించడంతో భారీ వర్షానికి గోతుల్లో భారీగా వర్షపునీరు చేరి రోడ్డు కాలువను తలపిస్తుంది. మండలంలోని శింగాపురం వద్ద ఎన్‌హెచ్‌ ఒక వైపు పనులు పూర్తిచేసి మరోవైపు మధ్యలో నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ప్రయాణించాలంటే ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అదుపు తప్పితే గోతులో పడే ప్రమాదముందని వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. చేపలు, రొయ్యల చెరువుల్లో భారీగా వర్షపునీరు చేరడంతో రైతులు విద్యుత్‌ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటకు తరలించారు.

ముదినేపల్లిలో 33.8 మి.మీ. వర్షపాతం

ఏలూరు సిటీ, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గడచిన 24 గంటలలో అత్యధికంగా ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 5.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. టి.నరసాపురంలో 17.4, పోలవరంలో 15, ద్వారకాతిరుమలలో 14.2, కామవరపుకోటలో 12.2, ముసునూరులో 9.4, చింతలపూడిలో 7.2, ఆగిరిపల్లిలో 6.8, కుక్కునూరులో 6.8, కైకలూరులో 6, లింగపాలెంలో 5.6, ఏలూరు అర్బన్‌లో 5.6, నూజివీడులో 3.2, చాట్రాయిలో 2.6, బుట్టాయిగూడెంలో 2, ఏలూరు రూరల్‌ లో 1.8, మండవల్లిలో 1.6, దెందులూరులో 0.8, భీమడోలులో 0.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేయడంతో కోతల వేళ ధాన్యం తడిసిపోతుం దని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:45 AM