ఏలూరు జిల్లాలో భారీ వర్షం
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:12 AM
జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో సరాసరి 6.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.
6.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
ఏలూరుసిటీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో సరాసరి 6.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. ద్వారకాతిరుమల మండ లంలో అత్యధికంగా 35 మి.మీ. వర్షపాతం నమో దైంది. జంగారెడ్డిగూడెంలో 34.6, చింతలపూడి 14.2, జీలుగుమిల్లి 12.8, బుట్టాయిగూడెం 11, కు క్కునూరు 9.8, కొయ్యలగూడెం 8.4, మండవల్లి 7.6, పోలవరం 6.8, టి.నరసాపురం 6.2, దెందులూ రు 4.2, వేలేరుపాడు 3.8, నూజివీడు 3.4, ఉం గుటూరు 3.4, భీమడోలు 3.4, నిడమర్రు 3, చాట్రా యి 2.8, లింగపాలెం 2.6, ముదినేపల్లి 2.4, ఆగిరిపల్లి 1.4, కైకలూరు 1.4, పెద పాడులో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటలకు అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఏజెన్సీలో పొంగిన కొండ వాగులు
బుట్టాయగూడెం/దెందులూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొండవాగులు పొంగి ప్రమా దకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మంగళవారం కంసాలికుంట–పద్మవారిగూడెం గ్రామాల మధ్య అల్లి కాలువ కొండవాగు పొంగి రాకపోకలకు అంతరా యం కలిగింది. వాగుకు ఇరువైపులా వాహనాలు, జనాలు నిలిచిపోయారు. వాగు ఉధృతి తగ్గుముఖం పట్టేవరకు అక్కడే పడిగాపులు పడ్డారు. అల్లికాలువ ఉధృతిని పరిశీలించిన ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ప్రజలను అప్రమత్తం చేశారు.
దెందులూరు మండలంలో పలు గ్రామాల్లో ఎండ మరికొన్ని గ్రామాల్లో పిడుగులతో వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి 9 గంటల వరకు పెరుగుగూడెం, చల్లచింతలపూడి, పోతునూరు, కొవ్వ లి తదితర గ్రామాల్లో ఉరుములు, మెరుపులు హడలెత్తించాయి. భారీ వర్షంతో పెరుగుగూడెంలో రోడ్లు కాలువలను తలపించాయి. లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యయి. రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
తగ్గుతూ.. పెరుగుతూ..
కుక్కునూరు/పోలవరం: గోదావరి వరద మరలా నెమ్మదించింది. భద్రాచలం వద్ద 39.50 అడుగులు నీటిమట్టం నమోదైంది. సాయంత్రానికి నెమ్మదిగా తగ్గుతూ 38అడుగులకు చేరింది. కాగా దిగువన పోలవరం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. కుక్కునూరు, దాచారం గ్రామాల మధ్య గుండేటివాగు లోలెవెల్ కాజ్‌వే నీట మునిగింది. ప్రజలు నల్లకుంట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. పోలవరం వద్ద నీటిమట్టం పెరగడంతో ప్రాజెక్టు నుంచి 7,66,812 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ఎగువన 31.600 మీటర్లు, దిగువన 22.750 మీటర్ల నీటిమట్టం నమోదైంది. పట్టిసీమ శివక్షేత్రం వద్ద వరద జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.