Share News

కురిసింది వాన

ABN , Publish Date - Jun 26 , 2025 | 12:56 AM

జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి జోరు వాన కరుసింది. ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులలో కూడిన భారీ వర్షాలు పలు చోట్ల కురిశాయి.

కురిసింది వాన
జలమయమైన జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి

ఏలూరు జిల్లాలో భారీ వర్షం

పల్లపు ప్రాంతాలు జలమయం

వరికి మేలు.. ఆక్వా గుభేలు

ఏలూరు సిటీ, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం మధ్యాహ్నం నుంచి జోరు వాన కరుసింది. ఈదురు గాలులు, ఉరుములు, పిడుగులలో కూడిన భారీ వర్షాలు పలు చోట్ల కురిశాయి. వర్షాలతో వరి నారుమడు లు, నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఎడతెరపిలేని వర్షంతో జనజీవనం స్థంభించింది. రహదారులు చిత్తడిగా తయారయ్యాయి. ఏలూరు నగరంతోపాటు జంగారెడ్డిగూ డెం, నూజివీడు, చింతలపూడి పట్టణాలు, మండల కేంద్రాలలో ప్రధాన రహదారులపై జనసంచారం తగ్గింది. ఏలూరు నగరంలో డ్రెయిన్లలో నీరు రహదారులపై చేరడంతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఏజెన్సీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కుండపోతగా వర్షం పడింది. బుట్టాయగూడెం మండలం లో చెరువులు, వాగులు, పంట కాల్వలు, పొలాల్లో వర్షపు నీరు చేరింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. డ్రెయినేజీలు పొంగి ఇళ్లు, దుకాణాల్లో వర్షపు నీరు చేరింది. ఊర చెరువు ప్రాంతంలో ప్రధాన రోడ్డుపై మోకాలి లోతు నిలిచింది. గాంధీ బొమ్మ సెంటర్‌, ఏలూరు, శ్రీనివాసపురం, అశ్వారావుపేట రహదా రులపై భారీ గుంతలు వర్షంతో గోతులన్నీ నిండిపోయి వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారు. జీలుగుమి ల్లిలో జోరు వానతో చెరువు ఆయకట్టు రైతులు వరి సాగు ముమ్మరం చేశారు. పెదపాడు మండలంలో తెలవారు జాము నుంచి వర్షం, జల్లులు పడుతూనే ఉన్నాయి. ఉదయం పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Updated Date - Jun 26 , 2025 | 12:56 AM