గాలి.. వాన..
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:40 AM
జిల్లాలో పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులుతో భారీ వర్షం కురిసింది.
గాలుల ఉధృతికి విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్థంభాలు
పలు గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
వేలేరుపాడు/కుక్కునూరు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులుతో భారీ వర్షం కురిసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగి పడడంతో సరఫరాకు అంతరాయం కలిగింది. విరిగి పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు రహదారులపై పడి ఉన్నాయి. కొన్ని ఇళ్లు ధ్వంసం కాగా రహదారులపై రాక పోకలు స్తంభించాయి. వేలేరుపాడు మండలం బుర్ర తోగు, భూదేవిపేట, శివకాశీపురం, తదితర గ్రామాల్లో ఆస్తినష్టం జరిగింది. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సరఫరా పునరుద్ధ రించడానికి చాలా సమయం పడుతుందని ప్రస్తుతం రోడ్లపై విరిగిపడ్డ విద్యుత్ స్తంబాలు, వైర్లు తప్పించే పనిలో ఉన్నామని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. బుర్రతోగు గ్రామంలో పలు ఇళ్లు ధ్వంసమ య్యాయి. కుక్కునూరు మండలంలో భారీ వర్షం కురి సింది. గాలి ఉధృతికి పలుచోట్ల కొమ్మలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వేసవి తాపంతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది.