Share News

మంచు ముసుగు

ABN , Publish Date - Nov 02 , 2025 | 12:49 AM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో గాలులు, వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తుఫాన్‌ ప్రభావం నుంచి బయటపడుతున్న వేళ మంచు ముసుగేసింది.

మంచు ముసుగు
తణుకు రూరల్‌ మండలం తేతలి వద్ద జాతీయ రహదారిపై కమ్మేసిన మంచు

జాతీయ రహదారిపై దట్టంగా అలుముకున్న మంచు

తణుకు/మొగల్తూరు/పాలకొల్లు టౌన్‌, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో గాలులు, వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తుఫాన్‌ ప్రభావం నుంచి బయటపడుతున్న వేళ మంచు ముసుగేసింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారీ పొగమంచు కురిసింది. జాతీయ రహదారితో పాటు గ్రామాలు, పట్టణాల్లో రోడ్డుపై వాహనదారులకు మార్గం కనిపించక ఇబ్బం దులు పడ్డారు. రెండు గజాల ముందున్న వాహనం కనిపిం చనంత దట్టంగా మంచుకు అలుముకుంది. అర్థరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయం లో పొగ మంచు కాస్తా చిన్నపాటి వర్షపు జల్లులను తలపించాయి. శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు మంచు దట్టంగా ఉంది. సుమారు 10 గంటల సమయంలో నెమ్మదిగా మంచు తెరలు వీడాయి. మొగల్తూరులోని పలు రహదారులతో పాటు ప్రధాన వీధులలో మంచు కురిసింది. మామిడి చెట్లు, కొబ్బరి, అరటి చెట్లు మంచు ముసుగులో చిక్కుకున్నాయి. మామిడి పూత మాడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10 గంటల వరకూ మం చుతో విద్యార్థులు, వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. పాలకొల్లు పట్టణంలో శనివారం తెల్లవారుజామున మంచు కమ్మేసింది. ఉదయం 8గంటల వరకూ మంచుతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. తెల్లవారుజామున ప్రయాణించే వారు మంచు కారణంగా ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Nov 02 , 2025 | 12:49 AM