దూకుడు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:52 AM
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లు వసూళ్లపై రాష్ట్ర ఉన్నతా ధికారుల నిరంత ర పర్యవేక్షణతో వసూళ్లు పురోగతి బాట పడు తున్నాయి. కేంద్రానికి, రాష్ర్టాలకు ఈ పన్నే కీలక ఆధారం కావడం తో వివిధ సంస్కర ణలను వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తోంది. దీంతో గత నాలుగు నెలలు కాలానికి జీఎస్టీ వసూళ్లల్లో ఐదు శాతం పురోగతిని జిల్లా యంత్రాంగం సాధించింది.
జీఎస్టీ వసూళ్లలో ఐదు శాతం పురోగతి
మొండి బకాయిలపై ఆర్‌ఆర్ యాక్టు ..
ఉమ్మడి జిల్లాలో రూ.90.70 కోట్లు బకాయిలు
అన్నిశాఖల సమన్వయంతోనే వసూళ్లు సాధన : జాయింట్ కమిషనర్
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లు వసూళ్లపై రాష్ట్ర ఉన్నతా ధికారుల నిరంత ర పర్యవేక్షణతో వసూళ్లు పురోగతి బాట పడు తున్నాయి. కేంద్రానికి, రాష్ర్టాలకు ఈ పన్నే కీలక ఆధారం కావడం తో వివిధ సంస్కర ణలను వాణిజ్యపన్నుల శాఖ అమలు చేస్తోంది. దీంతో గత నాలుగు నెలలు కాలానికి జీఎస్టీ వసూళ్లల్లో ఐదు శాతం పురోగతిని జిల్లా యంత్రాంగం సాధించింది.
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమలు, ఆక్వా, ఐరన్, రైస్‌మిల్లు, హార్డ్‌వేర్, ఇతర పరిశ్రమలు, ఆంధ్రా షుగర్స్ తదితర సంస్థల ద్వారా జీఎస్టీ వసూళ్లు జరుగుతుంటాయి. ఏడు సర్కిళ్లతో పాటు, 100 మంది ప్రధాన వ్యాపార డీలర్లతో మరో స్పెషల్ సర్కిల్‌తో కలిపి 2023–24కు రూ.649 కోట్ల ఆదా యానికి గాను రూ.453.43 కోట్లు, గడిచిన 2024–25 ఆర్థిక సంవత్స రంలో రూ.468.88 కోట్ల ఆదాయం సమకూరింది. ఆదా యం వసూళ్లు లక్ష్యాలు భారీగా పెరగడంతో వసూళ్లు స్థాయిని అందుకోలేని కారణంగా నెలల వారీగా లక్ష్యాలను విధించినట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్స రంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు రూ.191 కోట్ల లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.201 కోట్ల ఆదాయాన్ని వాణిజ్య పన్నుల శాఖాధికారులు సాధించారు. సగ టున 5 శాతం వసూళ్ల వృద్ధిరేటును సాధించారు. దీంతో రూ.10 కోట్ల అదనంగా వసూళ్లు చేశారు. మొత్తంగా 15,856 మంది స్టేట్ యాక్టివ్ టాక్స్ పేయర్స్‌గా, 11,005 మంది సెంట్రల్ యాక్టివ్ టాక్స్ పేయర్స్‌గా ఉన్నట్టు వాణిజ్య పన్నుశాఖ అధికారులు లెక్కలు చెబుతున్నాయి.
మొండి బకాయిలపై కొరడా
వాస్తవంగా 5,12,18,28 శాతం జీఎస్టీ స్లాబ్‌లు ఉంటాయి. వీటిలో అధికంగా పన్ను వసూలయ్యే 18, 28 శాతం స్లాబ్‌లో ఎక్కువగా పన్ను ఎగవేత జరుగు తోంది. సిమెంట్, ఐరన్, ఎలకా్ట్రనిక్ గూడ్స్, కంప్యూట ర్లు, బ్యాటరీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, సిగిరెట్లు తదితరాలు వీటి పరిధిలోకి వస్తాయి. ఎక్కువ మొత్తంలో జీఎస్టీ పనుల్న చెల్లించాల్సి ఉండడంతో వ్యాపారులు, సరుకు రవాణాదారులు అక్రమాలకు పాల్పడుతుంటారు. 50 లక్షల విలువైన సరుకు రవాణా చేస్తూ 10 లక్షల నుంచి 20 లక్షల సరకుకే పన్ను చెల్లిస్తారు. వీటిపై జిల్లా అధికారులు రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయో గిస్తున్నారు. 2017 జీఎస్టీ అమలు ప్రారంభమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు 853 మంది జీఎస్టీ కింద 90కోట్ల70 లక్షలు మొండి బకాయిలను చెల్లించాల్సి ఉంది. బ్యాంకులు, స్థానిక మున్సిపాల్టీల, పంచాయతీల సహకారంతో వారి ఆస్తులను గుర్తించి వారి నుంచి రికవరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.2.50 కోట్లు బకాయి లను రికవరీ చేశారు. వ్యాపారులు కూడా మేము అంత కట్టనవసరం లేదని అప్పీళ్లకు వెళ్లడం, కోర్టు లను ఆశ్రయించడంతో రావాల్సిన బకాయిలు పెండింగ్‌లోకి వెళుతున్నట్టు చెబుతున్నారు.
జూ కలెక్టర్ సమీక్షలూ దోహదం..
జీఎస్టీ వసూళ్ల పురోగతిపై కలెక్టర్ ఇటీవల సమీక్ష లు జరపాలన్న ఆదేశాలతో ఈ శాఖలో ఆదాయాల పురోగతి బాటన పడుతున్నాయి. మొండి బకాయిల వసూళ్లకు స్థానికంగా మున్సిపాల్టీలు, రెవెన్యూ, పంచా యతీరాజ్, బ్యాంకులతో పాటు వివిధ వర్తక సంఘాల తో ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీలతో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ముందడుగు వేస్తున్నారు. వే–బిల్లులు లేకుండా సరుకులను తరలించకుండా ఉం డేందుకు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధా నంగా ఉమ్మడి జిల్లాలో సిద్ధాంతం బ్రిడ్జి, అలంపురం, ఉంగుటూరు, గుండుగొలను, కలపర్రు హైవేలతో పాటు, తెలంగాణ నుంచి వివిధ వస్తువులు ఏలూరు జిల్లా మీద నుంచి దాటిపోకుండా జీలుగమిల్లి, నూజి వీడు, కొయ్యలగూడెం, భీమవరం, కైకలూరు ప్రాంతా ల్లో నోడల్ అధికారులు త నిఖీలు చేపడుతున్నారు.
ఎవరిని ఉపేక్షించం ..
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో జీఎస్టీ ఎగవేతదారులందరికి నోటిసులు జారీ చేశాం. ఎవ రిని ఊపేక్షించేది లేదు. ప్రభు త్వ ఆదేశాల మేరకు వివిధ శాఖల సమన్వయంతో వారితో ఆయా బకాయిలను కట్టించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యుఎస్, ఇరిగేషన్ ,ఆర్‌అండ్‌బీ శాఖల కాంట్రా క్టులను చేసి పన్ను ఎగవేసే కాంట్రాక్టర్ల వివరాలను సేకరిస్తున్నాం. త్వరలో వారిపైన చర్యలుంటాయి. పన్నుఎగవేత దారుల సమాచారం కోసం అవుట్ రీచ్ కార్యక్రమం ప్రారంభించాం. ఎక్కడైనా అనధికా రికంగా కోట్లలో వ్యాపారాలు చేసే వారి వివరాలను సామాన్యులు, చుట్టు పక్కల వారు మాకు సమా చారం ఇచ్చేందుకు వాట్సాప్ నంబర్‌ను 87126 31283ను ప్రవేశపెట్టాం. వివిధ సంఘాలతో మూడు నెలలకొకమారు అడ్వైజరీ కమిటీ సమావేశాలను నిర్వహించి జీఎస్టీ వసూళ్ల వేగంగా సాధించడానికి వారి సహకారం తీసుకుంటున్నాం.
– డాక్టర్ బి.నాగార్జునరావు, జాయింట్ కమిషనర్