Share News

గోదావరి జిల్లాలో.. భూగర్భ జలాలు అడుగంటడమా..!

ABN , Publish Date - Dec 18 , 2025 | 12:55 AM

ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంపై సీఎం చంద్రబాబు నాయు డు కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని ఆరా తీశారు.

గోదావరి జిల్లాలో.. భూగర్భ జలాలు అడుగంటడమా..!
సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

తొలిరోజు అమరావతిలో కలెక్టర్ల సదస్సు

తక్షణం వృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు

పురోగతికి ప్రణాళికలు అమలు చేస్తామన్న కలెక్టర్‌ వెట్రిసెల్వి

నేడు ఎస్పీలతో శాంతిభద్రతలపై సమీక్ష

ఏలూరు,డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడంపై సీఎం చంద్రబాబు నాయు డు కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని ఆరా తీశారు. ‘గోదావరి జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఏమిటీ ఈ సమస్య ఉందా?’.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమరావతిలో బుధవారం ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో వెట్రిసెల్వి, జిల్లాకు చెందిన మంత్రి కొలుసు పార్థసారఽథిలు హాజర య్యా రు. జిల్లాలో వాటర్‌ టేబుల్‌ 16.92 మీటర్లకు పడి పోవడంపై ఏమీ చేస్తున్నారన్నారంటూ కలెక్టర్‌ను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నవంబర్‌ నెలాఖరు తర్వాత వాటర్‌ ఆడిట్‌ చేసి, దానికి అనుగుణంగా భూగర్భ జలాలు వృద్ధికి చర్యలుండాల న్నారు. వెట్రిసెల్వి స్పందిస్తూ ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని వెట్రిసెల్వి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో 3 మీటర్లకు వాటర్‌ టేబుల్‌ను తీసు కురావాలని సీఎం సూచించారు. ఈ–ఆఫీస్‌, ఫైళ్ల క్లియరెన్స్‌, డేటా గవర్నె న్స్‌పై కలెక్టర్లు ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని ఆయన సూచించారు. ప్రధానంగా కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు పురోగతి, ఇన్‌ వెస్ట్‌ ప్రపోజల్స్‌, ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌, సెర్ఫ్‌, వెల్ఫేర్‌ హాస్టల్స్‌ అభివృద్ధి పనులు, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లపై సమీక్ష జరిగింది. పశుగ్రాసం పెంచే అంశంపై డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. మనం ఏం పనిచేస్తున్నా.. వివరాలు సమగ్రంగా ఉండా లి.. అనుకున్న సమయానికి లక్ష్యాలు నెరవేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. నిరంతరం నేర్చుకునే పనిలోనే ఉండాలి.. మంచి ఆలోచన ఏ అధికారి ఇచ్చిన తీసుకోండి. అన్ని నాకే అన్ని తెలుసనని అనుకోవద్దు.. నిరంతం నేర్చుకుంటూనే వేగంగా స్పందించేలా కలెక్టర్లు చర్యలుండాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష

ఆప్షన్‌–3 కింద ఇళ్ల నిర్మాణాల పురోగతి పైనా సమీక్ష జరిగింది. ఏలూరు జిల్లా 67 శాతం పురోగతి సాధించింది. జనవరి 15 నాటికి లక్ష్య సాధనకు కృషి చేపట్టాలని సీఎం సూచించారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలైన సమగ్రశిక్ష, ఉపాధి హామీల నిర్వహణ వ్యయంలో ఏలూరు జిల్లా 74 శాతం సాధించింది. రెండో రోజు జీరో పావర్టీ, పీ–4, స్కిల్డ్‌ ఎంప్లాయిమెంట్‌తో పాటు స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధన, స్వర్ణాంధ్ర 2047, జిల్లా కలెక్టర్ల సక్సెస్‌పై సీఎం సమీక్షిస్తారు. దీనికి ప్రభు త్వశాఖలు 15 శాతం వృద్ధిరేటు లక్ష్యాల సాధనపై తీసుకున్న చర్యలపైన చంద్రబాబు సమీక్షించనున్నారు. మరోవైపు శాంతి భద్రతలపైనా ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ కిశోర్‌ సమావేశానికి హాజరుకానున్నారు.

Updated Date - Dec 18 , 2025 | 12:55 AM