మైదానం నుంచి మరుభూమి వైపు
ABN , Publish Date - Jun 06 , 2025 | 01:05 AM
జిల్లాలో 40 ఏళ్ల క్రితం నక్సల్స్ సంచలనం.. పెదపాడు మండలం సత్యవోలు గ్రామానికి చెందిన విద్యార్థి తుపాకి వైపు మొగ్గుచూపారు.
సుధాకర్ స్వగ్రామం సత్యవోలు
40 ఏళ్ల క్రితం నక్సల్ ఉద్యమంలోకి
మావోయిస్ట్ అగ్రనేతగా కీలక బాధ్యతలు
జిల్లాలో 40 ఏళ్ల క్రితం నక్సల్స్ సంచలనం.. పెదపాడు మండలం సత్యవోలు గ్రామానికి చెందిన విద్యార్థి తుపాకి వైపు మొగ్గుచూపారు. ఇంట్లో చెప్పకుండా విద్యాభ్యాసం చేస్తున్న విజయవాడ నుంచి నేరుగా మావోయిస్టు ఉద్యమం వైపు కదిలారు. ఈ విషయం తెలిసి స్వగ్రామంతో పాటు మిగతా గ్రామాలు కూడా వణికిపోయాయి. అప్పుడలా వెళ్లిన విద్యార్థి ఇప్పుడు నిర్జీవంగా కనిపించారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
మావోయిస్టు ఉద్యమంలో అగ్రనేత ఎదిగిన తెంటు సుధాకర్ గురువారం బీజాపూర్ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. మూడు దశాబ్దాలుగా సుధాకర్ కోసం పోలీసు వేట కొనసాగుతోంది. ఒకప్పటి పీపుల్స్ వార్.. తర్వాత మావోయిస్టు పార్టీలో వ్యూహకర్తగా సుధాకర్ ఎది గారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో మావోయిస్టు కార్యకలా పాలు ఉధృతం కావడంలో సుధాకర్ కీలకంగా వ్యవహరిం చారు. రెండు రాష్ట్రాల పోలీసు బలగాలకు కంట్లో నలుస య్యారు. మారుమూల గ్రామాల్లో గిరిజనుల మద్దతు కూడగట్టడంలో ఆయన పాత్ర మావోయిస్టు అగ్రనేతలను సైతం సంతృప్తి పరిచింది. ఆయనకున్న ఉద్యమ అనుభ వం, తీసుకున్న నిర్ణయాలు మావోయిస్టు క్యాడర్‌ను అటవీ ప్రాంతంలో విస్తరించడం ద్వారా ఆయన పదేళ్ల క్రితమే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడయ్యారని చెబుతారు. ఆయనపై పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. సాధ్య మైనంత మేర సుధాకర్ లొంగిపోయేలా ఆయన కుటుంబంపై ఒత్తిడి చేసినట్లు కూడా ప్రచారం సాగింది. సుధాకర్ మాత్రం అటవీప్రాంతంతోపాటు ఆయుధాన్ని వదులలేదు. నాలుగు దశాబ్దాలపాటు నక్సల్స్ ఉద్యమంలో సుదీర్ఘంగా ప్రయాణించారు. ఆయన ఆచూకీ కోసం పోలీస్ బలగాలు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వచ్చాయి. ఆయన తలకు రూ.50లక్షల రివార్డు ప్రకటిం చారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జాతీయ అటవీ పార్కు వద్ద సుధాకర్ ను ఎన్‌కౌంటర్ చేశారు. మావోయి స్టు పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండగా, ఇప్పుడు సుధాకర్ ఎన్‌కౌంటర్ సైతం ఆ కోవలోకే వస్తుంది. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అప్పట్లో నక్సల్స్‌ను చర్చలకు పిలి చింది. జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మావోయిస్టు అగ్రనేత ఆర్‌కేతోపాటు తెంటు సుధాకర్‌తో పాటు ఆయన సతీమణి కాకరాల సునీత అలియాస్ ఉమా కూడా పాల్గొన్నారు. చర్చలనంతరం తిరిగి అజ్ఞాతం లోకి వెళ్లిన సుధాకర్ స్వగ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. పోలీసుల కంట పడలేదు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లోనే నిర్జీవంగా కనిపించారు.
కేసులు అనేకం : తెంటు సుధాకర్ అసలు పేరు కాగా పోలీస్ రికా ర్డుల్లో టీఎల్‌ఎన్ చలం, ఆనంద్, చంటి బాలకృష్ణ, రామరాజు, ఆర్‌ఆర్, అరవింద్, సోమన్న అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయనపై వివిధ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి. సీలేరు, మక్కువ, ఎల్వి న్‌పెంట, అన్నవరం తదితర పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయి.