ఎల్‌ఆర్‌ఎస్‌కు పచ్చజెండా
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:54 AM
అనధికార లే–అవుట్లలో ప్లాట్ ఉన్నవారు , లే–అవుట్లను అభివృద్ది చేసిన యజమానులు , మునుపటి ఎల్‌ఆర్‌ఎస్ 2020లో దరఖాస్తు చేయని వారు ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి.
వచ్చే ఏడాది జనవరి 23 వరకు గడువు పెంపు
అనధికార లే–అవుట్లలో ప్లాట్ ఉన్నవారు , లే–అవుట్లను అభివృద్ది చేసిన యజమానులు , మునుపటి ఎల్‌ఆర్‌ఎస్ 2020లో దరఖాస్తు చేయని వారు ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.ఈ ఏడాది జూన్ 30 ముందు నాటి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్ సమర్పించాలి, ప్లాట్ సైజ్, భూమి విలువ ఆధారంగా ఛార్జీలు నిర్ణయిస్తారు. ఓపెన్ స్పేస్ లేనప్పుడు భూమి విలువపై 7 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు కట్టాలి. 45 రోజుల్లో మొత్తంగా చెల్లిస్తే 10 శాతం రాయితీ, 46 నుంచి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ (ఓపెన్ స్పేస్, సీఎల్‌యూ ఛార్జీలపై వర్తించదు) వర్తిస్తుంది. దరఖాస్తు చేసినప్పుడు కనీసం రూ.10 వేలు లేదా 50 శాతం ఛార్జీలు చెల్లించాలి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రియల్‌ఎస్టేట్ రంగంలోని యజమానులు, ప్లాట్ల ఓనర్లకు శుభవార్త. అనధికార లే–అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్)కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీని కటాఫ్‌గా తీసుకుంది. ఆ పరిధిలో ఉన్న వాటిని క్రమబద్ధీకరించేందుకు వచ్చే ఏడాది జనవరి 23 వరకు (మూడు నెలలు) గడువును పొడిగించింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్‌కు కటాప్‌గా 2020 డిసెంబరు 31వ తేదీతో ఇటీవల వరకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ గడువు ఇటీవలే ముగియడంతో మరో మూడు నెలలు గడువును ప్రభుత్వం పొడిగించింది. జిల్లాలో ఇడా పరిధిలో ఉమ్మడి జిల్లాలోని 40 మండలాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఐదు మండలాల్లోని పంచాయతీలు లే–అవుట్ల, ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు ఇప్పటి వరకు 3,935 దరఖా స్తులు అందినట్టు ఇడా అధికారులు తెలిపారు. ఏలూరు కార్పొరేషన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌కు 90కుగా పైగా దరఖాస్తులను అధికారులు పరిష్కరించాల్సి ఉంది. మిగతా మునిసిపాలిటీ ల్లోనూ వీటి సంఖ్య స్వల్పంగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతించడంతో రియల్‌ఎస్టేట్ రంగానికి మరింత ఊపు వచ్చే అవకాశం ఉంది.
ఐదేళ్లలోపు లే–అవుట్లకు బంపర్ ఆఫర్
కూటమి ప్రభుత్వం ఐదేళ్లలోపు లే–అవుట్లను క్రమబద్ధీక రించేందుకు యజమానులకు తాజాగా బంపర్ ఆఫర్ ఇచ్చినట్లే. 2020 డిసెంబరు 31వ తేదీతో ముగిసిన కటాప్ డేట్‌ను ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు పొడిగించారు. దీంతో అన్ని అనధికారిక లే–అవుట్లల్లో భాగంగా సబ్ డివిజన్ ఆఫ్ ప్లాట్స్, వెంచర్లు వేసిన భూమి యజమానులు, డెవల పర్స్, సంస్థలు, కంపెనీలు, సొసైటీలకు చెందిన వారు ఈ ఏడాది జూన్ 30వ తేదీలోగా రెగ్యులరైజేషన్‌కు రిజిస్టర్ చేసుకుని ఉండాలి. సేల్ డీడ్ ప్రాధాన్యతగా తీసుకుంటారు. ఉదాహరణకు పదెకరాల లే–అవుట్‌కు రిజిస్టర్ చేసుకుని రెండు ఎకరాలు లే–అవుట్ చేసుకోకపోతే వారు పెనాల్టీతో క్రమబద్ధీకరించుకోవచ్చు. ప్లాట్లకు దాని అసలు విలువపై ఓపెన్ స్పేస్ ఛార్జీల కింద 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్ వల్ల చట్టబద్ధ భవన అనుమతులు, ఆఽధునిక వసతులు (నీరు, విద్యుత్, డ్రెయినేజీ) సౌకర్యాలు పొందవచ్చు. భవిష్యత్‌లో న్యాయబద్ధ్దమైన లావాదేవీలతో పాటు చట్టపరమైన భద్రత కలిగి ఉండవచ్చు. ఇడా పరిధిలో అయితే హెల్ప్‌డెస్ ఫోన్ నంబర్ 99668 48055లో సంప్రదించవచ్చు.
అర్హతా ప్రమాణాలు
ఫక్రమబద్ధీకరణకు జూన్ 30,2025లోగా రిజస్టర కాబడిన అనధికార ప్లాట్లు/ లే–అవుట్లకు వర్తిస్తాయి.
ఫ కనీసం ఒక ప్లాట్ అమ్మకం ఈ తేదీకి ముందుగా జరిగి ఉండాలి
ఫ ప్లాట్ అనధికారిక లే–అవుట్‌ల్లో భాగంగా ఉండాలి.