Share News

దేవాలయాల ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - May 08 , 2025 | 12:52 AM

జిల్లాలోని నామినేటెడ్‌ పోస్టుల భర్తీ జాతర ప్రారంభమైంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న కూటమి పార్టీల క్యాడర్‌కు ఉత్సాహాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

దేవాలయాల ట్రస్టు బోర్డుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

దేవదాయ శాఖ ఉత్తర్వులు

ఆశావహులకు నామినేటెడ్‌ జాతర

భీమవరం టౌన్‌, మే 7(ఆంధ్రజ్యోతి):జిల్లాలోని నామినేటెడ్‌ పోస్టుల భర్తీ జాతర ప్రారంభమైంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న కూటమి పార్టీల క్యాడర్‌కు ఉత్సాహాన్ని అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి 11 నెలలు కావస్తున్నా ఇంత వరకు నామినేటెడ్‌ పోస్టులు భర్తీ కాకపోవడంతో క్యాడర్‌లో అసంతృప్తి నెలకొంది. ఈ తరుణంలో దేవదాయ, ధర్మదాయ శాఖకు సంబంధించిన ఆలయాలకు ట్రస్టు బోర్డులను నియమించేందుకు ఆ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 129 దేవాలయాలకు ధర్మకర్తలమండలిని నియమించడానికి ఆదేశాలు జారీ అయ్యాయి. సంబంధిత దేవాలయాలకు అర్హులైన వారు నోటిఫికేషన్‌ జారీచేసిన 20 రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలి. అనంతరం ఈ దరఖాస్తులను పరిశీలించి నియమిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఐదు లక్షల ఆదాయం కలిగిన దేవాలయాలకు మాత్రమే ప్రస్తుతం ఉత్తర్వులు ఇచ్చారు.

నియమ నిబంధనలు

వార్షికాదాయం రూ.ఐదు నుంచి రూ.25 లక్షలు వచ్చే దేవాలయాలు, సత్రాలకు తొమ్మిది మంది సభ్యులు, రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండే దేవాలయాలు, సత్రాలకు 11 మంది, రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు వచ్చే వాటిల్లో 11 మంది, రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్లలోపు 13 మంది సభ్యులు, రూ.20 కోట్లపైగా ఆదాయం ఉండే దేవాలయాలు, సత్రాలకు 17 మంది ట్రస్ట్‌ సభ్యులుంటారు. ఆయా సభ్యులో ఒక బ్రాహ్మణ, ఒక నాయీ బ్రాహ్మణ, 50 శాతం మహిళలు ఉండాలి. వీరిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సభ్యులకు అవకాశం కల్పించాలి. సభ్యులంతా హిందువులై ఉండి, 30 ఏళ్ల వయసు నిండిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ప్రముఖ ఆలయాలు

జిల్లాలోని ప్రముఖ దేవాలయాలైన భీమవరం మావుళ్ళమ్మ, పంచారామక్షేత్రమైన గునుపూడి సోమేశ్వర, జనార్దన స్వామి, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి, నత్తా రామేశ్వరం, జుత్తిగ సోమేశ్వరస్వామి, ఆచంట రామలింగేశ్వరస్వామి తదితర ఆలయాలు ఉన్నాయి. కొన్ని ప్రముఖ దేవాలయాలకు ఉత్తర్వులు జారీ కాలేదు.

నియోజకవర్గాల వారీగా ఆలయాలు..

భీమవరం నియోజకవర్గంలో.. మావుళ్ళమ్మ, సోమేశ్వరస్వామి ఆలయాలతోపాటు ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి, పోలేరమ్మ, శ్రీరాంపురం రామలింగేశ్వరస్వామి, దాసాంజనేయస్వామి, భీమేశ్వరస్వామి, దుర్గాలక్ష్మి మల్లేశ్వరస్వామి, శివకేశవ స్వామి, వీరవాసరం విశ్వేశ్వర సుబ్రహ్మణ్యస్వామి, వేణుగోపాలస్వామి, అగస్తేశ్వరస్వామి, అనాకోడేరు భీమేశ్వరస్వామి, తాడేరు రామలింగేశ్వరస్వామి, యనమదుర్రు శక్తీశ్వరస్వామి, నవుడూరు రామలింగేశ్వర స్వామి ఆలయాలకు ఉత్తర్వులు వెలువడ్డాయి. జువ్వలపాలెం రోడ్డులోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం(దంతులూరి జగన్నధరాజు సత్రం)కు ఉత్తర్వులు రాలేదు.

తణుకు నియోజకవర్గంలో.. తణుకు వేంకటేశ్వరస్వామి ఆలయం, కేశవస్వామి, మహాలక్ష్మీ అమ్మవారు, సీతారామాంజనేయ స్వామి, నటరాజ సీతారామసుబ్ర హ్మణ్య స్వామి, తుమ్మలపల్లి కృష్ణమూర్తి విశ్రాంతి భవన్‌, సజ్జాపురంలోని శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం, ఈడూరు రామలింగేశ్వర స్వామి, ఇరగవరం కేశవస్వామి, శ్రీ పాలేశ్వర శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రేలంగి తాటకేశ్వర, మల్లేశ్వ రస్వామి, శ్రీ గోపాల, శ్రీ ఆంజనేయ స్వామి, వేల్పూరు రుద్రేశ్వర వీరభద్ర, మహాలక్ష్మీ, మంచిలి పుంతలో ముసలమ్మ, తిరుపతిపురం వేణుగోపాలస్వామి, వరిగేడు అరవంబిక, మల్లేశ్వరస్వామి, వేణుగోపాల స్వామి, వెంకట్రాయపురం పట్టాభిరామస్వామి, కావలిపురం భీమేశ్వరస్వామి, ఉనికిలి మాధవ స్వామి, రాపాకఖండ్రిక మార్కండేయ స్వామి, రాపాక విశ్వేశ్వర, విఘ్నేశ్వరస్వామి ఆలయం, కొత్తపాడు సీతారామాంజనేయ, ముత్యాలమ్మ, ఉనికిలి రామలింగేశ్వర, గుమ్మంపాడు భీమేశ్వరస్వామి, కోనాల గోపాలస్వామి ఆలయాలు ఉన్నాయి.

ఆచంట నియోజకవర్గంలో... ఆచంట మదనగోపాలస్వామి, పెదమల్లం పల్లాలమ్మ మాచేనమ్మ, పెనుగొండ జనార్దనస్వామి, సిద్ధాంతం విజయ గోపాలస్వామి, నరేంద్రస్వామి, కేదారేశ్వరస్వామి, కొడమంచిలి సర్వేశ్వరస్వామి, వడలి అగస్తేశ్వర స్వామి, ఆచంట వేమవరం సోమేశ్వరస్వామి, చెరుకువాడ విశ్వేశ్వరస్వామి, చెన్నకేశ్వరస్వామి, గుమ్మలూరు సోమేశ్వరస్వామి, భట్లమగుటూరు నరేంద్రస్వామి, కరుగోరుమిల్లి కుమారస్వామి, నడిపూడి సుబ్రహ్మణ్యస్వామి, పెనుమంట్ర సీతా రామచంద్రస్వామి, ఇంద్రేశ్వరస్వామి, ఎస్‌.ఇలింద్రపర్రు అగస్తేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి, కల్యాణం స్పెసిఫిక్‌ ఎండోమెంట్‌, కొయ్యేటిపాడు సోమేశ్వర స్వామి, మాముడూరు జగదేశ్వరస్వామి, మల్లిపూడి మదనగోపాలస్వామి, పండితవిల్లూరు మూలేశ్వరస్వామి, కేశవస్వామి జగన్నాధపురం రామేశ్వరస్వామి, పోడూరు మూలేశ్వర రాజేశ్వర కేశవస్వామి, మట్టపర్రు రాజలింగేశ్వరస్వామి, మినిమించిలిపాడు విశ్వేశ్వరస్వామి, జగన్నాధపురం సీతారామస్వామి, పెనుమదం ఉమా అగస్తేశ్వరస్వామి, గుమ్మలూరు సోమేశ్వరస్వామి, వేడంగి ఉమారామలింగేశ్వరస్వామి, జిన్నూరు చెన్నమల్లేశ్వరస్వామి ఆలయాలు..

పాలకొల్లు నియోజకవర్గంలో... పాలకొల్లు అద్దేపల్లి గంగరాజు ఆశ్రమం, బంగారు విశ్వనాధం ఆశ్రమం, సలాది వారి ఆశ్రమం, రాపాక వారి ఆరఽశమం, యలమంచిలి ఉమా సోమేశ్వరస్వామి, కేశవస్వామి, శివదేవుని చిక్కాల శివదేవస్వామి, దొడ్డిపట్ల కనకదుర్గమ్మ, వేడంగి ఉమా రామలింగేశ్వరస్వామి, పెనుమర్రు విద్యానందీశ్వరస్వామి, కాజా వేణుగోపాలస్వామి, జిన్నూరు చెన్నమల్లేశ్వరస్వామి, దిగమర్రు ఉమా మహేశ్వరస్వామి, పూళ్ళ వశిష్ట సంప్రదాయ శివానంద ఆశ్రమం, పెనుమదం ఉమా అగస్తేశ్వరస్వామి, విప్పర్రు రాజేశ్వరస్వామి ఆలయాలు..

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో.. పడమర విప్పర్రు ఆదికేశవస్వామి, విప్పర్రు మహాలక్ష్మి మహాంకాళి అమ్మవారు, ముదునూరిపాడు బాల

వేంకట స్వామి, వల్లూరిపల్లి విశ్వేశ్వరస్వామి, ఏఎస్‌ఆర్‌ శాస్త్రి ఆశ్రమం, చింతపల్లి భీమేశ్వరస్వామి, కొండేపాడు కనకదుర్గమ్మ, ఆరుళ్ల వేణుగోపాలస్వామి, వేంకటేశ్వర స్వామి, కొండ్రుప్రోలు వీరేశ్వరస్వామి ప్రత్తిపాడు కనకదుర్గమ్మ ఆలయాలు..

ఉండి నియోజకవర్గంలో...ఆకివీడు ఏనుగులమ్మ, పెద్దింట్లమ్మ, కాళ్ల సోమేశ్వరస్వామి, కాళ్ళకూరు భీమేశ్వర స్వామి, కోరుకొల్లు రామలింగేశ్వరస్వామి, మాదివాడ వేంకటేశ్వరస్వామి, శ్రీ మల్లేశ్వరస్వామి, నరసింహరాజ అగ్రహారం విశ్వేశ్వరస్వామి, చినకాపవరంముక్తి వేంకటేశ్వర స్వామి, సీసలి గోపాలస్వామి, రామలింగేశ్వర స్వామి, ఆరేడు కేశవస్వామి, తాండకేశ్వరస్వామి, ఉండి క్యాంప్‌బెల్‌ ఆశ్రమం, గుమ్ములూరు వేణుగోపాలస్వామి, దొడ్డనపూడి కేశవస్వామి, తుప్పన పూడి మదనగోపాలస్వామి, అద్దమూరు జనార్దనస్వామి ఆలయాలు

నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురంలో మదన గోపాలస్వామి, జనార్దనస్వామి, అమరేశ్వరస్వామి, ఆదికేశవ స్వామి, కపిల మల్లేశ్వరస్వామి, లక్ష్మేశ్వరం దుర్గా లక్ష్మేశ్వరస్వామి, కుమ్మరపురుగుపాలెం రాజగోపాలస్వామి ఆలయాల్లో పాలకవర్గాలను నియమించనున్నారు.

Updated Date - May 08 , 2025 | 12:52 AM