Share News

హోదా మారింది!

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:43 AM

జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ గ్రేడ్‌–2 నుంచి గ్రేడ్‌–1 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్‌ అయ్యింది.

హోదా మారింది!
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం

జీవో విడుదల చేసిన మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

29 నుంచి 33 లేదా 35కు పెరగనున్న వార్డులు

జంగారెడ్డిగూడెం,నవంబరు 28(ఆంధ్రజ్యో తి):జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీ గ్రేడ్‌–2 నుంచి గ్రేడ్‌–1 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్‌ అడ్మిని స్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరీ ఎస్‌.సురేష్‌కుమార్‌ శుక్రవారం జీవో ఎంఎస్‌ నెంబర్‌–243 జారీచేశారు.

మేజర్‌ పంచాయతీ నుంచి..

2011లో పట్టణంలో 48,994 జనాభా ఉండ గా మేజర్‌ పంచాయతీ నుంచి నగర పంచా యతీగా అప్‌గ్రేడ్‌ అయ్యింది. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారి పరిపాలనలో వున్న తర్వాత 2013లో మొదటిసారి నగర పంచాయతీ ఎన్ని కలు జరిగాయి. మేజర్‌ పంచాయతీగా ఉన్నప్పు డు ఉన్న 20 వార్డులతోనే ఎన్నికలకు వెళ్లారు. మొదటి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా టీడీపీ నుంచి బంగారు శివలక్ష్మి ఎన్నికయ్యారు. పట్టణ ఆదాయ వనరులు పెరగడం, జనాభా పెరగడంతో గ్రేడ్‌–2 మునిసిపాలిటీగా అప్‌గేడ్‌ చేయాలని అప్పటి మున్సిపల్‌ కౌన్సిలర్‌ నంబూరి రామచంద్ర రాజు బోర్డు తీర్మానంతో హైకోర్టును ఆశ్రయిం చారు. 2019లో హైకోర్టు ఆదేశాల మేరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్రేడ్‌–2 మునిసి పాలిటీగా అప్‌గ్రేడ్‌ చేసింది. 20 వార్డులను 29 వార్డులుగా విభజించారు.

గ్రేడ్‌–1గా ప్రమోషన్‌

గ్రేడ్‌–1 మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ అవడంతో ప్రస్తుతం ఉన్న 29 వార్డులు 33 నుంచి 35 కు చేరే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూ.15 కోట్ల ఆదాయంతో పట్టణం అభివృద్ధి చెందుతోంది. పట్టణంలో 70 వేలకు పైగా జనాభా ఉండడం, ఆదాయ వనరులు, గ్రేడ్‌–1 మునిసి పాలిటీకి తగినట్లుగా అన్ని అర్హతలుండడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రస్తుత పాలకవర్గం 2023లో తీర్మానం చేసి మున్సిపల్‌ శాఖకు పంపినా అప్పట్లో ప్రత్యేక దృష్టి పెట్టలేదు. అప్పటి ఎమ్మెల్యే పెద్దగా పట్టించుకోలేదు.

ఎమ్మెల్యే రోషన్‌ కుమార్‌ ప్రత్యేక శ్రద్ధ

2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ గ్రేడ్‌–2గా ఉన్న మునిసిపాలిటీని గ్రేడ్‌–1 మార్చడానికి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ప్రస్తుతం ఉన్న పాలక వర్గం నూతనంగా తీర్మానం చేయడానికి సుముఖత చూపక పోవడంతో 2023లో మున్సిపల్‌ శాఖకు పంపిన తీర్మానం ఆధారంగా ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ 2025 అక్టోబరులో మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌, ఇతర మంత్రులను స్థానిక టీడీపీ నాయకులతో కలిసి లేఖ అందించారు. నిత్యం ఉన్నతాధికా రులు, సంబంధిత మంత్రులతో మాట్లాడి వేగంగా అనుమతులు రావడానికి ఎమ్మెల్యే కృషి చేశారు.

కూటమి నాయకుల హర్షం

జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీని గ్రేడ్‌–1 మునిసి పాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పట్టణ టీడీపీ అఽధ్యక్షు డు కొండ్రెడ్డి కిశోర్‌ అఽధ్యక్షతన స్థానిక టీడీపీ కార్యాల యంలో శుక్రవారం విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే రోషన్‌ కుమార్‌ కృషితో గ్రేడ్‌ –1 మునిసి పాలిటీగా ఏర్పడడం పట్ల కూటమి నాయకులు పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు,మేకా ఈశ్వరయ్య,కొప్పాక శ్రీనివాస రావు,పెనుమర్తి రామకుమార్‌,బొబ్బర రాజ్‌పాల్‌ కుమార్‌, చింతల నాని, గురజాల ఉమా మహేశ్వరి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Nov 29 , 2025 | 12:43 AM