జిల్లాలో కిసాన్ డ్రోన్స్‌కు రూ.3.14 కోట్లు
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:22 AM
వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలని, రైతు గ్రూపులకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
రైతులకు రాయితీపై సరఫరా
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం రూరల్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో సాంకేతికతను వినియోగించాలని, రైతు గ్రూపులకు రాయితీపై డ్రోన్లు అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు సబ్సిడీ విడుదలతో బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ నాగరాణి రైతులకు చెక్కులను అందజేశారు. రైతులు నూతన సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లాలో కిసాన్ డ్రోన్స్ పేరిట గ్రూపులకు 80 శాతం సబ్సిడీతో 40 డ్రోన్స్ లక్ష్యంగా నిర్ణయించగా, 41 డ్రోన్లను కేటాయించడం జరిగిందన్నా రు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవాలన్నారు. యంత్ర పరికరాల వినియోగంతో ఉత్పత్తి పెరగడంతోపాటు ఖర్చు తగ్గుతుందని, ఆదాయం పెరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్డు వెంకటేశ్వరరావు, ఏడీఏలు మురళీకృష్ణ, కె.శ్రీనివాస్, సీహెచ్.శ్రీనివాస్, అనిల్‌కుమారి, రమేష్, రాఘవేంద్రరావు, ఏవో రాధిక ప్రియదర్శిని, రైతులు తదితరులు పాల్గొన్నారు.