Share News

ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలం

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:03 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల డిమాండ్స్‌ గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయాయని, ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడానికి ఏపీ ఎన్జీవో సంఘం బాధ్యత తీసుకున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు.

ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలం
మాట్లాడుతున్న ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

భీమవరం టౌన్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల డిమాండ్స్‌ గత ప్రభుత్వం నుంచి పేరుకుపోయాయని, ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడానికి ఏపీ ఎన్జీవో సంఘం బాధ్యత తీసుకున్నదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అన్నారు. భీమవరంలో జిల్లా ఏపీ ఎన్‌జీవోల అసోసియేషన్‌ అడహక్‌ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిఽథిగా పాల్గొన్న సందర్భంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించటంలో సుముఖంగా ఉందని, అందులో భాగంగా సుమారు రూ.11వేలకోట్లు ఉద్యోగుల ఖాతాల్లో జీపీఎఫ్‌ తదితర సొమ్ములు పడ్డాయని తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగులకు పెండింగ్‌ బకాయిలు సుమారు రూ.3,200 కోట్లు ప్రాన్‌ అకౌంట్స్‌లో జమ చేసేలా ఏపీ ఎన్జీవో సంఘం కృషి చేసిందన్నారు. హెల్త్‌కార్డ్స్‌ సరిగా విని యోగంలోకి రావటం లేదని దీని వలన ఉద్యోగవర్గం తీవ్రంగా నష్టపోతున్నారని,ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ, చోడగిరి శ్రీనివాసరావు, నెరుసు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎన్‌జీవోల జిల్లా అడహక్‌ కమిటీ ఎన్నిక

ఏపీ ఎన్జీజివోస్‌ అసోసియేషన్‌ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్‌, కార్యదర్శి నెరుసు రామారావు జిల్లా సంఘం అడహక్‌ కమిటీ ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా ఉదిసి వెంకట పాండురంగారావు, కన్వీనర్‌గా పోతన సుకుమార్‌, కో– ఛైర్మన్‌గా అల్లూరి శ్రీనివాస రాజు, కో–కన్వీనర్లుగా ఎంఆర్‌కె రాజు, దేవాబత్తుల నాగ దేవి, ఇంజేటి రమేష్‌, సుంకర వెంకటేష్‌లను ప్రకటిచారు. కార్య్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శులు శివ ప్రసాద్‌, రాం ప్రసాద్‌, జేఏసీ నాయకులు ఆర్‌ఎస్‌ హరనాఽథ్‌, రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పాము శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా భీమవరం పాత బస్‌ స్టాండ్‌ నుంచి బైక్‌ ర్యాలీగా త్యాగరాజ భవన్‌ వరకు సాగింది.

Updated Date - Dec 04 , 2025 | 01:03 AM