Share News

గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌

ABN , Publish Date - May 14 , 2025 | 01:03 AM

జిల్లాలో వ్యవసాయ, గృహ విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విద్యుత్‌శాఖాధికారులను ఆదేశించారు.

గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌
సమావేశంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌, కలెక్టర్‌ వెట్రిసెల్వి

జిల్లా విద్యుత్‌ కమిటీ సమావేశం

ఏలూరు, మే 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వ్యవసాయ, గృహ విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విద్యుత్‌శాఖాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా విద్యుత్‌ కమిటీ సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగింది. పునరుద్ధరించబడు పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ ఎస్‌) కింద వ్యవసాయ, వ్యవసాయేతర ఫీడర్ల విభజన, ఓవర్‌ లోడు ఫీడర్ల విభజన, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు తదితర అంశాలపై విద్యుత్‌శాఖాధికారులతో సమీక్షించారు. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలను అందించాలన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద రూ.176 కోట్ల వ్యయంతో వ్యవసాయ ఫీడర్ల నుంచి వ్యవసాయేతర సర్వీసులను వేరుచేసే ఫీడర్ల విభజన కార్యక్రమాలు, అదే విధంగా రూ.66.51 కోట్ల వ్యయంతో ఓవర్‌ లోడ్‌ ఫీడర్ల విభజన పను లను డిసెంబరులోగా పూర్తి చేసేందుకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశిం చుకోవాలన్నారు. హెచ్‌టీ, ఎల్‌టీ, వ్యవసాయ సర్వీసులు, అధిక సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లకు, ఫీడర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌ కుమార్‌ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్‌ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తమ ప్రాంతం లో చేపట్టిన 11 సబ్‌స్టేషన్‌ నిర్మణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుత్‌ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఆర్‌డీఎస్‌ఎస్‌ కింద కేటాయించిన పనులు తమ నియోజకవర్గంలో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఎస్‌ఈ సాల్మన్‌రాజు, ఈఈలు రాధాకృష్ణ, అంబేడ్కర్‌, శశిధర్‌, ఖాన్‌, డీఈ, ఏడీఈ, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 01:03 AM