Share News

ఉద్యోగులకు మంచి రోజులు

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:09 AM

తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల వెతలను తీర్చేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది.

ఉద్యోగులకు మంచి రోజులు

ఆర్జిత సెలవులకు వెసులుబాటు

సరెండర్‌ చేయడానికి అనుమతి

దరఖాస్తు చేసుకుంటున్న ఉద్యోగులు

వైసీపీ హయాంలో చేతులెత్తేసిన ప్రభుత్వం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేరుస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తోంది. ఉద్యోగుల వెతలను తీర్చేందుకు నిర్ణయాలు తీసుకుంటోంది. వైసీపీ హయాంలో ఉద్యోగులు వెతలకు లెక్కేలేదు. సరైన సమ యానికి వేతనాలు కూడా ఇవ్వలేదు. ఆర్జిత సెలవులను సరెండర్‌ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగులకు ప్రతిఏటా 15 ఆర్జిత సెలవులుంటాయి. వాటిని వినియోగించు కోనట్టయితే ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తారు. లేదంటే ఉద్యోగ విరమణ సమయంలో మొత్తం ఆర్జిత సెలవులను లెక్కకట్టి ప్రభుత్వం ఉద్యోగికి సొమ్ములు విడుదల చేస్తుంది. అదికూడా గరిష్టంగా 300 సెలవలకు మాత్రమే అవకాశం ఇస్తుంది.అంతకు మించి ఉన్నట్టయితే రద్దయి పోతాయి. అదే కారణంతో ఉద్యోగులు వినియో గించని ఆర్జిత సెలవులను విధుల్లో ఉండగానే సరెండర్‌ చేస్తుంటారు. ఫలితంగా ప్రభుత్వం నుంచి సొమ్ము తీసు కుంటారు. కొందరు ఉద్యోగులైతే ప్రతిఏటా ఆర్జిత సెలవుల సొమ్ము వస్తుందని ప్రణాళికలు చేసుకుంటారు. పండుగ రోజుల్లోనో, విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికో ఆర్జిత సెలవుల సొమ్మును వినియోగించు కుంటారు. ఉద్యోగులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆదాయపు పన్ను కోసం వేతనంలో కోత పడు తుంది. ఆ సమయంలో ఆర్జిత సెలవుల సొమ్మును వినియోగించుకునేలా ముందుగానే దరఖాస్తు చేసకుంటారు. ఇలా ఒక్కో ఉద్యోగి తమ అవసరా లను తీర్చుకోవడానికి ప్రణా ళికతో ఉంటారు. గత ప్రభు త్వంలో ఉద్యోగుల లెక్క తప్పింది. సరైన సమయానికి వేతనాలు మంజూరు కాకపోవడంతో బ్యాంకులకు రుణ వాయిదా చెల్లించలేకపోయారు. ఆర్జిత సెలవులను ప్రభుత్వానికి అప్పగిస్తే సొమ్ములు వస్తాయన్న భరోసా లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌ పనిచేయలేదు. ఓక వేళ పనిచేసినా ప్రభుత్వం సొమ్ము చెల్లించలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్జిత సెలవు లపై అవకాశం కల్పించింది. అవసరమైన వారంతా సెలవులను సరెండర్‌ చేస్తున్నారు.

సొమ్ములు ఎంతంటే..

ఉద్యోగులు తమకు ఉన్న ఆర్జిత సెలవులు ఎన్ని ఉన్నాసరే ప్రభుత్వానికి సరెండర్‌ చేసు కోవచ్చు. అందుకు తగ్గ సొమ్మును ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే 30 రోజులను సరెండర్‌ చేస్తే ఉద్యోగికి నెల జీతం ఇస్తారు. అదే 15 రోజులు అయితే సగం వస్తుంది. రోజూ వారీ జీతాన్ని లెక్కకట్టి ఉద్యోగికి చెల్లిస్తారు. వీటిపై ఏ రోజూ ఆంక్షలు లేవు. దీంతోత ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను సరెండర్‌ చేస్తూ దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో 14 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వారందరికీ ప్రభుత్వం ఇచ్చే వెసులుబాటుతో ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగుల అవసరాలు తీరనున్నాయి. ఇప్పటికే సరెండర్‌ చేసిన సెలవులపై ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ స్థాయిలోనూ దీనిపై కసరత్తు చేస్తున్నట్టు ఉద్యోగ వర్గాలు చెపుతున్నాయి.

Updated Date - Jun 16 , 2025 | 12:09 AM