Share News

పెరుగుతున్న గోదావరి

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:32 AM

గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం తెలంగాణలోని భద్రాచలం వద్ద 40.80 అడుగుల నీటిమట్టం నమోదు కాగా సాయంత్రానికి 44.70 అడుగుల నీటిమట్టంకు చేరుకుంది.

 పెరుగుతున్న గోదావరి
కుక్కునూరు గుండేటివాగు తీరంలో పోటెత్తిన గోదావరి

కుక్కునూరు/ పోలవరం, సెప్టెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం ఉదయం తెలంగాణలోని భద్రాచలం వద్ద 40.80 అడుగుల నీటిమట్టం నమోదు కాగా సాయంత్రానికి 44.70 అడుగుల నీటిమట్టంకు చేరుకుంది. వరద 43 అడుగులు దాటడంతో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో మండలంలోని రెవెన్యూ సిబ్బంది గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. పోలవరం వద్ద శుక్రవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం పెరిగింది.

కొల్లేరును ముంచెత్తిన వరద

మండవల్లి : కొల్లేరుకు వరద నీరు ముంచెత్తడంతో నిండుకుండలా మారింది. ప్రస్తుతం పెద్దఎడ్లగాడి పెనుమాకలంక ప్రధాన రహదారిపై రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 64 కాలువల నుంచి కొల్లేరుకు నీరు చేరుతోంది. ఇది ఉప్పుటేరు గుండా సముద్రంలో కలుస్తోంది. అయితే కొల్లేరు, ఉప్పుటేరు సరస్సులో భారీగా గుర్రపుడెక్క మేట వేసుకోవడంతో నీటి ప్రవాహానికి తీవ్ర అడ్డంగా మారింది. ఇప్పటికే పెద్దఎడ్లగాడి నుంచి పెనుమాక లంక, ఇంగిలిపాకలంక, నందిగామలంకకు రోడ్డు మార్గా లు తెగిపోయాయి. అంతకంతకు వరద పెరుగుతుండ డంతో లంక గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలోనే పెనుమాకలంక గ్రామ స్థులు ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు.

కొనసాగుతున్న వర్షాలు

ఏలూరుసిటీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షా లు కురుస్తున్నాయి. శుక్రవారం జిల్లాలోని చాలా ప్రాం తాల్లో మబ్బుల వాతావరణం నెలకొని ఉంది. ఈ వర్షా లు ప్రసుతం సార్వా సాగుకు అనుకూలిస్తాయని చెబుతున్నారు. జిల్లాలో సార్వా పనులు జోరుగా సాగుతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలోనే అత్య ధికంగా ఆగిరిపల్లి మండలంలో 12.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం ఒక మిల్లీ మీటరుగా నమోదైంది. నూజివీడు 10.4, చాట్రాయి 3.2, బుట్టాయిగూడెం 1, వేలేరుపాడు 0.2 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.

Updated Date - Sep 27 , 2025 | 12:32 AM