Share News

గోదావరి వరద తగ్గింది

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:42 AM

గోదావరి వరద తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు.

గోదావరి వరద తగ్గింది
కుక్కునూరులోని గుండేటివాగు వరకు తగ్గిన గోదావరి వరద

కుక్కునూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద తగ్గడంతో ఏజెన్సీ ప్రాంతవాసులు ఊపిరిపీల్చుకున్నారు. భద్రాచలం వద్ద నీటి మట్టం సోమ వారం సాయంత్రం 23.2 అడుగులకు చేరింది. కుక్కునూరులో గుండేటి వాగు వరకు గోదావరి తగ్గిపోయింది. గొమ్ముగూడెం నుంచి దాదాపు 250 కుటుంబాలు దాచారం పునరావాస కాలనీకి తరలివచ్చారు. జంగారెడ్డి గూడెం మండలం చల్లావారి గూడెంలో పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంతో వారంతా గొమ్ముగూడెంలోను ఉంటున్నారు. వరదతో దాచారం పునరావాస కాలనీకి తరలివచ్చారు. వర్షాకాలం మూడు నెలలు వారు పునరావాసంలో ఉండాలని అధికారులు సూచించారు.

Updated Date - Jul 15 , 2025 | 12:42 AM