Share News

జీవో తెచ్చిన తంటా

ABN , Publish Date - May 11 , 2025 | 12:48 AM

జిల్లాలో నూతన భవన నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు నూజి వీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, మునిసి పాలిటీల్లో మూడునెలలుగా ఒక ప్లాన్‌ రాలేదు. దీనికి కారణం జీవో నెం.20గా పేర్కొనవచ్చు. సామాన్యుల మేలు కోరి తీసుకొచ్చిన జీవోనే వారిని ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేసేలా చేస్తోంది.

 జీవో తెచ్చిన తంటా

భవన నిర్మాణ ప్లాన్స్‌ అప్రూవల్స్‌ సరళతరానికి జీవో–20 అమలు

మూడు నెలలుగా నో ప్లాన్స్‌..నో అప్రూవల్‌

ఎల్‌టీపీలు, నిర్మాణదారుల్లో ఆందోళన

ప్రణాళిక విభాగం ఆదాయానికి గండి

(ఏలూరు టూటౌన్‌–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నూతన భవన నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థతోపాటు నూజి వీడు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, మునిసి పాలిటీల్లో మూడునెలలుగా ఒక ప్లాన్‌ రాలేదు. దీనికి కారణం జీవో నెం.20గా పేర్కొనవచ్చు. సామాన్యుల మేలు కోరి తీసుకొచ్చిన జీవోనే వారిని ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెనుకడుగు వేసేలా చేస్తోంది.

భవన నిర్మాణ ప్లాన్‌ అప్రూవల్స్‌ సరళతరం చేయ డానికి ప్రభుత్వం జీవో నంబరు 20 తీసుకొచ్చింది. ఈ జీవోలో నిబంధనల కారణంగా భవన నిర్మాణ యజ మానులు ప్లాన్‌ తీసుకోవడానికి భయపడుతున్నారు. ప్లాన్‌లు ఇవ్వడానికి లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ జంకుతు న్నారు. గతంలో భవనం నిర్మించుకోవడానికి ఎల్‌టీపీలు ప్లాన్‌ వేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేవారు. జిల్లాలోని మునిసిపాలిటీలు ప్రణాళిక విభాగం సిబ్బం ది, అధికారులు ఆ ప్లాన్‌ను సరి చూసి అప్రూవల్‌ చేసేవారు. అనంతరం భవన నిర్మాణాన్ని యజమాని ప్రారంభించేవాడు. ప్లాన్‌ ప్రకారం భవన నిర్మాణం జరుగుతుందా.. లేదా అని ప్రణాళిక విభాగం సిబ్బం ది పర్యవేక్షించేవారు. ప్లాన్‌ ప్రకారం కట్టకుండా నిర్మా ణంలో డివియేషన్‌ అయితే జరిమానా విధిం చేవారు. చిన్నచిన్న పొరపాట్లను పట్టించుకునేవారు కాదు.

జీవోతో అందరూ వెనుకడుగు

భవనాలు నిర్మించుకునే నిర్మాణదారులు ప్లాన్‌ అప్రూవల్‌ కావాలంటే అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తుందనే భావనతో ప్రభుత్వం నిబంధనలను సరళతరం చేసింది. జీవో నంబరు 20 తీసుకొచ్చింది. మునిసిపల్‌ అధికారులకు, సిబ్బందికి అధికారాలు తొలగించి ఆ అధికారాలను లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ (ఎల్‌టీపీలకు) కట్టబెట్టింది. భవన నిర్మాణదారుడు ప్లాన్‌లు డివియేట్‌ చేస్తూ నిర్మాణం కొనసాగిస్తే అతనిపైనా చర్యలు తీసుకునేందుకు జీవో లో పేర్కొంది. ప్లాన్‌ ప్రకారం నిర్మాణం జరుగుతుం దా.. లేదా.. అని ఎల్‌టీపీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఏదైనా నిర్మాణాల విషయంలో పొర ాట్లు జరిగితే ఎల్‌టీపీల లైసెన్స్‌లను రద్దు చేస్తామని జీవోలో ప్రభుత్వం హెచ్చరించింది. అవసరమైతే క్రిమి నల్‌ కేసులు పెడతామని హెచ్చరించింది. దీనివల్ల భవనాలు నిర్మించుకునే యజమానులు, ప్లాన్‌లు ఇచ్చే ఎల్‌టీపీలు ముందుకురావడంలేదు.

ఆదాయానికి గండి

గత మూడునెలల నుంచి జిల్లాలోని మునిసి పాలిటీల ప్రణాళిక విభాగానికి భవనం నిర్మించుకు నేందుకు ఒక్క ప్లాన్‌ రాలేదు. ఒకరిద్దరు భవన యజ మానులు ముందుకొచ్చినా ఎల్‌టీపీలు బాయ్‌కాట్‌ చేశారు. నిబంధనలు సరళించాలని మునిసిపల్‌ మంత్రి నారాయణకు మొరపెట్టుకున్నా ఫలితంలేదు. దీంతో గత మూడు నెలలుగా జిల్లాలో ఆదాయానికి గండి పడింది. ప్రతీనెల జిల్లాలో వంద నుంచి 200 భవనాల నిర్మాణానికి కొత్తప్లాన్‌లు వచ్చేవి. వీటి ద్వారా నెలకు వచ్చే సుమారు రూ.రెండు కోట్ల ఆదా యాన్ని మునిసిపాలిటీలు కోల్పోయాయి. భవన నిర్మా ణ కార్మికులకు పనులు లేకుండా పోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో 20ని సవరించి భవన నిర్మాణాలకు ప్లాన్స్‌ అప్రూవల్‌ చేసే పనిని సులభ తరం చేయాలని భవన నిర్మాణ యజమానులు, ఎల్‌టీపీలు, కార్మికులు కోరుతున్నారు.

భవన నిర్మాణాలకు ముందుకు రండి..

ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే ప్రభుత్వం జీవో నంబరు 20ని తీసుకొచ్చింది. భవన నిర్మాణ యజ మానులు, ఎల్‌టీపీలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొత్తజీవో ప్రకారం నగరపాలక సంస్థ అధికారా లను ఎల్‌టీపీలకు కట్టబెట్టింది. భవనాలు నిర్మించు కునేందుకు యజమానులు, ప్లాన్‌లు ఇచ్చేందుకు ఎల్‌టీపీలు ముందుకురావాలి.

– ఎ.భానుప్రతాప్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌

జీవో 20లో సవరణలు చేయండి

స్వీయసర్టిఫికేషన్‌ టీమ్‌ 2025 జీవో నంబరు 20 తీసుకొచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. అయితే ఎల్‌టీపీల భయాందోళనలను తొలగించాలి. స్థల యజమాని భవనాన్ని సరిగా నిర్మించకపోయినా, తప్పుడు సమాచారం ఇచ్చి ప్లాన్‌ అప్రూవల్‌ చేయించుకున్నా ఎల్‌టీపీలను బాధ్యులను చేయడం సమంజసం కాదు. లైసెన్స్‌లు రద్దు, కేసులు పెడతా మనడం దారుణం. జీవోను సవరించి మున్సిపల్‌ అధికారులకే పర్యవేక్షణ అధికారం ఇవ్వాలి. కొత్త జీవో వల్ల మూడునెలలుగా ఎల్‌టీపీలమంతా ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డాం.

– డి.బాలాజీ, ఏలూరు లైసెన్స్‌డ్‌ టెక్నికల్‌ పర్సన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నగర అధ్యక్షుడు, జి.శ్రీనివాసన్‌, సెక్రటరీ

Updated Date - May 11 , 2025 | 12:48 AM