Share News

నిధులొచ్చాయ్‌!

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:11 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్‌ అండ్‌ఆర్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్ప నకు నిధులు వరదలా వస్తున్నాయి.

నిధులొచ్చాయ్‌!
కాలనీలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాలకు పునాదులు తీస్తున్న ఎక్స్‌కవేటర్‌

రామన్నగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి మహర్దశ

మౌలిక సదుపాయాలకు రూ.16 కోట్లు విడుదల

పనులు చేపట్టిన కాంట్రాక్టరు

బుట్టాయగూడెం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్‌ అండ్‌ఆర్‌ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్ప నకు నిధులు వరదలా వస్తున్నాయి. రామన్న గూడెం సమీపంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గిరిజనుల కోసం ప్రభుత్వం నిర్మించిన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు రూ.16 కోట్లు విడుదల కాగా కాంట్రాక్టరు పనులను ప్రారంభించారు. కాలనీలో సదుపాయా లు కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పట్టించుకున్న నాథుడే లేడు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల కావడం పట్ల నిర్వాసిత గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని పోచారం, చొక్కనపల్లి, కొల్లూరి, కొండేపూడి, తుమ్ములేరు గ్రామాలు ముంపునకు గురవుతుం డగా వారికోసం బుట్టాయగూడెం మండలంలోని నిమ్మ లగూడెం పంచాయతీ రామన్నగూడెం సమీపంలో 562 ఇళ్లు నిర్మించారు. సుమారు 600 కుటుంబాలు నివాసం ఉంటుండగా 1,020 మంది ఓటర్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో నిర్వాసితులను రామన్నగూడెం కాలనీకి తరలించినా మౌలిక సదుపాయాలు లేక వారంతా ఇబ్బందులు పడ్డారు. పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ గోడు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వారి సమస్యలపై దృష్టి పెట్టింది. కాలనీలో 8 కిలోమీటర్లు మేర సీసీ రోడ్లు, డ్రెయినేజీలు ఏర్పా టు చేయడానికి రూ.16 కోట్లు విడుదల చేసినట్టు పీఆర్‌ స్పెషల్‌ ఏఈ అంకిరెడ్డి తెలిపారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు గురువారం కాలనీలో పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సంతోషంగా ఉంది

సమస్యలతో సతమవు తున్న మా కాలనీలో రూ.16 కోట్లతో పనులు చేపట్టడం సంతోషంగా ఉంది. నిధులు విడుదల చేసిన సీఎం చంద్ర బాబుకు కాలనీవాసులంతా ధన్యవాదాలు తెలుపు తున్నాం. రామన్నగూడెం కాలనీకి తరలివచ్చిన ఐదు గ్రామాలు గతంలో తుమ్మూరు పంచాయతీ లో ఉండేవి. ఇక్కడ కూడా ఆ ఐదు గ్రామాలను ప్రత్యేక పంచాయతీ చేయాలి. సచివాలయం, రైతు సేవా కేంద్రం ఏర్పాటు చేయాలి.

– వేట్ల ముత్యాలరెడ్డి, రామన్నగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ

Updated Date - Dec 12 , 2025 | 12:11 AM