Share News

పంచాయతీలు విలవిల

ABN , Publish Date - Jul 29 , 2025 | 12:44 AM

నిధుల లేమితో పంచాయతీలు విలవిలలాడుతున్నాయి. రెండు విడతలుగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది.

పంచాయతీలు విలవిల

ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూపు

రిజిస్ట్రేషన్ల ద్వారా బదిలీ పన్ను 18 నెలలుగా నిలిచిపోయింది

రూ.60 కోట్లు పెండింగ్‌

రూ.53 లక్షలు చెల్లింపు!

ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసినా పంచాయతీలకు తప్పని తిప్పలు

స్పందించని అధికారులు

నిధుల లేమితో పంచాయతీలు విలవిలలాడుతున్నాయి. రెండు విడతలుగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. మరోవైపు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి బదిలీ పన్ను జమ కావడం లేదు. కూటమి ప్రభుత్వం పంచాయతీలపై ఆర్థిక ఆంక్షలు ఎత్తివేసినా ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా విడుదల చేయలేదు.

(భీమవరం)

నిధుల లేమితో పంచాయతీలు విలవిల్లాడు తున్నాయి. రెండు విడతలుగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. దాదాపు రూ.50 కోట్లు మేర పంచాయతీల్లో జమ చే యాలి. ఇటీవల పంచాయతీలకు ఆర్థిక వెసులు బాటు కల్పించడంతో పనులు నిర్వహించిన తక్షణమే బిల్లులు అయిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో పంచాయతీ నిధులపై ఆంక్షలను ఎత్తి వేశారు. కానీ ఆర్థిక సంఘం నిధులు 2 విడతలుగా విడుదల కాలేదు. పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించకపోవడం వల్లే తదుపరి విడత విడుదల చేయడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. జిల్లాలో దాదాపు 10శాతం పంచాయతీలు గతంలో మంజూరైన ఆర్థిక సంఘం నిధులను పూర్తిస్థాయిలో వెచ్చించలేదు. అత్యవసర పనుల కోసం దాచిపెట్టుకున్నామని చెబుతున్నారు. ఆస్తి పన్ను అంతంత మాత్రంగా ఉన్న పంచాయతీల్లో మంచినీటి సమస్యలు ఉత్పన్నమైతే తక్షణ చర్యల కోసం కొద్దిపాటి నిధులు భద్రపరచుకున్నారు. మరోవైపు పట్టణా ల్లో విలీన గ్రామాలకు పంచాయతీ నిధులు అవరోధంగా మారాయి. విడుదల కావడం లేదు. పాలకవర్గాలు లేకపోవడంతో సమస్య ఏర్పడిం ది. ఇదికూడా తదుపరి ఆర్థిక సంఘం నిధుల విడుదలకు ఆటంకంగా మారిందని పంచాయ తీలు గగ్గోలు పెడుతున్నాయి. ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

ఉపాధి నిధులే ఆధారం

పంచాయతీల్లో ఉపాధి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే జిల్లాలోని అన్ని పం చాయతీలకు ఉపాధి హామీ పథకంలో రూ.57 కోట్లు మంజూరు చేశారు. సీసీ రహదారులు, డ్రెయిన్లు నిర్మించారు. ఇప్పుడిప్పుడే బిల్లులు చెల్లిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు తోడైతే పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీస్తుంది. మంచి నీటి వసతిని మెరుగు పరచుకునే అవకాశం ఉంటుంది. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా సాగుతుంది. రహదారులు వంటి మౌలిక వస తులు కల్పిస్తారు. అందుకోసం పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి.

ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ పెండింగ్‌

పంచాయతీలకు మరో ఆదాయ వనరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి వచ్చే బదిలీ పన్ను. రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే 7.5 శాతం స్టాంప్‌ డ్యూటీలో 1.5శాతం స్థానిక సంస్థలకు బదిలీ చేస్తారు. మునిసిపాలిటీ, పంచాయతీలు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌కు జమ చేస్తారు. 18 నెలల నుంచి పంచాయతీలకు బది లీ పన్ను జమ చేయడం లేదు. వైసీపీ హయాం లో ఆంక్షలు విధించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తేనే పంచాయతీలకు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి బదిలీ చేస్తుంటారు. ఇటీ వల రూ.53 లక్షలు మాత్రమే బదలాయించారు. వాస్తవానికి ఏటా జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖకు దాదాపు రూ.400 కోట్లు ఆదాయం వస్తోంది. స్టాంప్‌ డ్యూటీ రూపంలో రూ.250 కోట్లు జమ అవుతున్నాయి. బదిలీ పన్ను రూపంలో రూ.45 కోట్లు స్థానిక సంస్థలకు బదిలీ కావాలి. ఆ సొమ్ము బదిలీ చేయకపోవడంతో పంచాయతీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వస్తేనే బదిలీకి అవకాశం ఉంటుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా లకు పంచాయతీల నుంచి వినతులు వెళుతు న్నా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేదు. ఈ నిధులు కూడా అందుబాటులో లేక పంచాయతీ లు ఆర్థిక ఇబ్బందలు ఎదుర్కొంటున్నాయి.

Updated Date - Jul 29 , 2025 | 12:44 AM