నిధులొచ్చాయ్!
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:40 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు పైసా విదల్చకపోవడంతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొర పెట్టుకున్నా పట్టించుకున్న నాఽథుడే కరువయ్యాడు.
రహదారులకు మహర్దశ
వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతులకు పైసా విదల్చకపోవడంతో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు మొర పెట్టుకున్నా పట్టించుకున్న నాఽథుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం రావడంతో రోడ్లపై దృష్టి సారించి నియోజక వర్గాల వారీగా రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తోంది. తాజాగా చింతలపూడికి రూ.52 కోట్లు, నూజివీడుకు రూ.10 కోట్లు నిధులు విడుదల చేసింది.
చింతలపూడి నియోజకవర్గం.. రూ.52.46 కోట్లతో పనులు
జంగారెడ్డిగూడెం రూరల్, నవంబరు 28 (ఆంధ్ర జ్యోతి): స్థానిక రహదారుల నిర్మాణాలు మా బాధ్య తంటూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ హామీలు నెరవేరుస్తున్నారు. సంక్రాంతి పండుగ టార్గెట్‌గా చింతలపూడి నియోజక వర్గంలో దాదాపు రూ.52 కోట్లు విలువైన రోడ్డు పనులు మొద లయ్యాయి. నియోజకవర్గంలో పాడైన రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణాలకు పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బీ, జడ్పీ నిధులు మొత్తం రూ.52.46 కోట్లు మంజూరు కాగా పనులు ప్రారంభ మయ్యా యి.వీటిలో పంచాయతీరాజ్‌కు సంబంధించి రూ.22. 55 కోట్లు, ఆర్‌అండ్‌బీకి సంబంధించి రూ.24.91 కోట్లు, జడ్పీ నిధులు రూ.5కోట్లు విలువ చేసే పనులు జరు గుతున్నాయి.
నిధులు మంజూరైన రోడ్లు
కామవరపుకోట మండలంలోని కామవరపుకోట– యడవల్లి రహదారికి రూ.4కోట్లు, జీలకర్రగూడెం– కామవరపుకోట వయా అంకాలంపాడు రోడ్డు రూ.7.70కోట్లు, లింగపాలెం మండలంలోని లింగ పాలెం–టీసీహెచ్‌ఆర్‌పాలెం రూ.3.80 కోట్లు, అయ్యప్ప రాజుగూడెంకు రూ.55 లక్షలు, చింతలపూడి– కామవరపుకోట రూ.1.80 కోట్లు, చింతలపూడి–రావికం పాడు వయా టి.నరసాపురం రోడ్డు రూ.1.57 కోట్లు, చింతలపూడి–గురుపట్లగూడెం రూ.3.80 కోట్లు, దేవుల పల్లి–లక్కవరం రూ.70లక్షలు, ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వరకు అక్కడక్కడ 6 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.10.27 కోట్లతో పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు జడ్పీ నిధుల కింద శ్రీనివాసపురం రోడ్డుకు రూ.80 లక్షలు, అక్కంపేటకు రూ.50 లక్షలతో పాటు మరో రూ.3.50 కోట్లు రోడ్డు నిర్మాణాలు జరగనున్నాయి.
నూజివీడు రహదారులకు రూ.10 కోట్లు
(నూజివీడు–ఆంధ్రజ్యోతి):
నూజివీడు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రహదారుల మరమ్మతులకు రూ.10 కోట్లు నిఽధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలో ఈసారి ముసునూరు మండలానికి రహదారుల మరమ్మ తుల్లో ప్రాధాన్యత లభించింది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులకు నిధులు సాధించడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. మంత్రి అయిన తొలి నెలలో నూజి వీడు మండలంలో కొన్నగుంట, నూజివీడు పట్టణం లో ప్రధాన రహదారి సీసీ రోడ్డుగా నిర్మాణానికి అనుమతి, నిధులు సాధించి పనులు చేయించారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకం పనులు నిర్వహించ డంతో విమర్శలు రావడంతో మంత్రి కాంట్రాక్టర్‌ను పిలిచి మందలించారు.
నిధులు మంజూరైన రహదారులు
ఆగిరిపల్లి మండలంలో చొప్పరమెట్ల – సద్గురు రహదారిపై 3.70 కిలోమీటర్లు పరిధిలో మరమ్మ తులకు రూ.150 లక్షలు, ముసునూరు మండలం పరిధిలో సింహాద్రిపురం కొర్లగుంట రహదారి 1.35 కిలోమీటర్ల పరిధికి రూ.కోటి, అక్కిరెడ్డిగూడెం– గోగులపాడు రహదారి 4.70 కిలోమీటర్లకు రూ.కోటి, ఆగిరిపల్లి మండలం కొత్త ఎదర–నూజివీడు రహ దారికి నాలుగు కోట్లు, ఆగిరిపల్లి మండలం కట్లూరు– నూజివీడు రహదారికి 70 లక్షలు, ముసునూరు మండలం పరిధిలో రమణక్కపేట సూరేపల్లి తుమ్మగూడెం రహదారి మూడు కిలోమీటర్లకు రూ.180 లక్షలు నిధులు మంజూరయ్యాయి.
ఎయిర్‌పోర్టు రహదారిపై దృష్టి సారించాలి
నియోజకవర్గంలో ఆగిరిపల్లి నుంచి గన్నవరం రోడ్డు మరమ్మతులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతు న్నాయి. తెలంగాణ నుంచి సత్తుపల్లి అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల ప్రజలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. ఈ రహదారి నిర్మాణం ప్రారంభమై పూర్తికాకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో పాటు వాహనాల టైర్లు దెబ్బతినడం, ప్రయాణ కాలం ఆలస్యం అవుతోంది. ఈ ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయి తారు రోడ్డు ఏర్పడితే నూజివీడుకు మంచి కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు అవుతుంది. దీనిపై మంత్రి దృష్టి సారించి ఈ రహదారికి నిధులు విడుదల చేయించాలని ప్రజలు కోరుతున్నారు.