జల కళ
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:21 AM
భారీ వర్షాలతో మెట్ట ప్రాంతంలో జలాశయాలు జల కళ సంతరించుకున్నాయి.
మెట్ట ప్రాంతంలో పూర్తిగా నిండిన జలాశయాలు
భారీ వర్షాలతో మెట్ట ప్రాంతంలో జలాశయాలు జల కళ సంతరించుకున్నాయి. తమ్మిలేరు, పోగొండ, ఎర్రకాల్వ జలాశయాలు సామర్ధ్యం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం నమోదైంది. సాగు నీటి అవసరాలకు ఉపయోగమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయగూడెం జల్లేరు జలాశయంలో పూర్తిస్థాయి నీటి మట్టం నమోదు కాకపోవడం నిరాశ కలిగించింది.
నిండిన తమ్మిలేరు
చింతలపూడి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): చింతలపూడి సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయరు జలకళతో అలరారు తోంది. ఏలూరుకు తమ్మిలేరు ముంపు నివారణ కోసం నాగిరెడ్డిగూడెం వద్ద బహుళార్ధక ప్రయోజనంగా రిజర్వా యర్ నిర్మించారు. వరద నివారణ, సాగునీటి వనరుగా ఉంది. రిజర్వాయర్ రెండు బేసిన్‌లు కలిసి మూడు కాలు వల ద్వారా పంటలు సాగవుతాయి. ఎగువ భాగం తెలం గాణలోని బేతుపల్లి చెరువు అలుగు నీరు తమ్మిలేరు వాగు గా ప్రవహిస్తుంది. దిగువన కుడి, ఎడమ, మధ్య కాలువల నుంచి తొమ్మిది వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లా వైపు 4,500 ఎకరాలు, పశ్చిమలో 4,500 ఎకరాలకు సాగునీరు అందించారు. జిల్లాలు మారడంతో ప్రస్తుతం కుడి, ఎడమ, మధ్య కాలువలు ఏలూరు జిల్లాలో కలిసి ఉన్నాయి. ఈ ఏడాది బుధవారం నాటికి నీటి మట్టం 340 అడుగులు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 340 అడుగులు నమోదైంది. 344 అడుగుల వద్ద ఇరిగేషన్ లెవెల్ నిల్వ చేస్తారు. 348 అడుగులు నీటి మట్టం చేరితే వరద గేట్ల ద్వారా అదనపు నీరు దిగువకు విడుదల చేస్తారు. ఇప్పటికే నూరు శాతం ఊడ్పులు పూర్తయ్యి రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 16 కోట్ల జపాన్ బ్యాంకు నిధులతో చేపడుతున్న మరమ్మతు పనులు నత్తనడకలా సాగుతు న్నాయని రైతులు చెబుతున్నారు.
పొర్లుతున్న పోగొండ
బుట్టాయగూడెం: పోగొండ జలాశయం నిండుకుండను తలపిస్తుంది. జలాశయం నీటి మట్టం సామర్ధ్యం 157 మీటర్లు కాగా ప్రస్తుతం అంతే నీటి మట్టం ఉండడంతో సర్‌ప్లస్ ఛానల్ ద్వారా దిగువకు నీరు పొర్లుతోంది. పోగొండ జలాశయం కొద్దిపాటి వర్షానికి వచ్చే వరద నీటితో నిండిపోతుంది. వర్షపాతం గత ఏడాదితో పోలిస్తే 65 శాతం మైనస్‌లో ఉంది. ఆగస్టు నెలాఖరుకు 297 మి.మీ. వర్షపాతం నమోదు కావలసి ఉండగా ఇప్పటివరకు 102.6 మి.మీ. మాత్రమే పడింది. గత ఏడాది ఇదే సమయంలో 193.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
జల్లేరులో వెలితి
గుబ్బల మంగమ్మ జల్లేరు జలాశయం పూర్తిగా నిండ లేదు. గత ఏడాది ఇదే సమయంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో పూర్తి జలకళతో ఉంది. ఈ ఏడాది పూర్తిస్థాయి నీరు చేరలేదు. జలాశయం పూర్తి సామర్ధ్యం 217.80 మీటర్లు కాగా ప్రస్తుతం 212.40 మీటర్లు ఉంది. గత ఏడాది ఇదే సమయంలో నీటిమట్టం 215.75 మీటర్లుగా ఉంది. గతంతో పోలిస్తే 3.35 మీటర్ల నీటి సామర్ధ్యం తక్కువ ఉంది. జలాశ యం ద్వారా 4500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆయకట్టు రైతులంతా వర్షాల కోసం ఎదురుచూస్తున్నా రు. వరుణుడు కరుణించాలని కోరుతున్నారు.
ఎర్రకాలువ జలాశయంలో వరద నీరు
జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలతో జంగారెడ్డిగూడెం మండలం కొంగువారి గూడెంలోని ఎర్రకాలువ జలాశయంలో వరదనీరు భారీగా చేరింది. జలాశయం కెపాసిటీ 83.50 మీటర్లు కాగా ప్రస్తు తం 81.42 మీటర్లు ఉంది. 81.50 మీటర్ల వరకు వరద నీరు ప్రాజెక్టులోకి చేరితే దిగువకు నీటిని విడుదల చేయా ల్సి ఉంటుంది. 2018 ఆగస్టులో భారీ వరదల కారణంగా ఎర్రకాలువ జలాశయంలోకి ఒక్క గంటలోనే 83.50 మీట ర్లుకు పైగా వరద నీరు చేరడంతో జలాశయం గేట్ల పై నుంచి వరద నీరు దిగువకు ప్రవహించింది. దిగువ ప్రాంతాలలో ఉన్న ఇళ్లు, పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టాన్ని తీసుకువచ్చింది. గత ఏడాది ఇదే రోజుకు జలా శయంలో 81.89 మీటర్లు వరద నీరు చేరిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు.