Share News

ఇక వాసవి పెనుగొండ

ABN , Publish Date - Nov 02 , 2025 | 01:15 AM

ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి పుణ్యధామం పెనుగొండ. ఈ క్షేత్రాన్ని ‘వాసవి పెనుగొండ’గా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక వాసవి పెనుగొండ

ఆర్య వైశ్యుల హర్షం

పెనుగొండ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి):ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి పుణ్యధామం పెనుగొండ. ఈ క్షేత్రాన్ని ‘వాసవి పెనుగొండ’గా మార్పు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి సవిత స్పష్టతనిచ్చారు. త్వర లో జీవో విడుదల చేయనున్నట్టు వారు తెలిపారు. దీనిపై ఆర్య వైశ్యులలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 31న అమ్మవారి ఆత్మార్పరణ దినాన్ని ప్రభు త్వపరంగా ప్రకటించి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు పెనుగొండ క్షేత్రానికి వచ్చారు. ఆ సమయంలో ఆర్య వైశ్య సంఘం నేతలు పెనుగొండను వాసవి పెనుగొండగా మార్చాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. తర్వాత జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వాసవి ధామ్‌కు వచ్చిన తరుణంలోను ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. ఇటీవల పవన్‌ కార్యాలయ సిబ్బంది పెనుగొండ వచ్చిన తరుణంలో మరోసారి విన్నవించారు. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు త్వరలోనే ‘వాసవి పెనుగొండ’గా మార్పు చేస్తామని ఎమ్మెల్యే పితానికి తెలిపారు.

రెండు మూడు రోజుల్లో ప్రకటన

ఆర్య వైశ్యుల ఆరాధ్యదైవం పెను గొండ వాసవి కన్యకా పరమేశ్వరి కొలువైన క్షేత్రం. దేశవ్యాప్తంగా వున్న ఆర్య వైశ్యులు జీవితంలో ఒక్కసారై నా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని భక్తిని చాటుకుంటారు. ఈ నేపథ్యం లోనే ఆంధ్రప్రదేశ్‌లో పెనుగొండ, పెను కొండ అనే పేర్లతో రెండు ప్రాంతాలు ఉండటంతో దేశ వ్యాప్తంగా వున్న భక్తులు తికమకపడుతున్నారు. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెనుకొండకు వెళ్లి మళ్లీ ఇక్కడకు వస్తున్నారని ఆర్యవైశ్యుల ప్రతినిధులు వాసవి పెనుగొండగా నామకరణం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లను కోరారు. ఈ మేరకు వారు అంగీకరించారు. రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. భవిష్యత్తులో వాసవి పెనుగొండగా నామకరణం జరుగుతుంది.

– పితాని సత్యనారాయణ, ఆచంట ఎమ్మెల్యే

చరిత్రలో నిలిచిపోతుంది

ఈ పుణ్యక్షేత్రాన్ని ‘వాసవి పెను గొండ’గా మారుస్తుండడంతో మాకు ఎంతో శక్తి వచ్చినట్లు అయ్యింది. చాలా సంతోషం. 2025 జనవరిలో సీఎం చంద్రబాబు వాసవిమాతను దర్శించుకుని ఇచ్చిన హామీ మేరకు పేరు మారుస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతలు. ఎమ్మెల్యే పితాని సత్య నారాయణ తోపాటు స్థానిక ప్రజలు, భక్తుల సహకారం మరువలేనిది. భవిష్యత్తులో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెంది, చరిత్ర లో నిలిచిపోతుంది.

– ప్రజ్ఞానంద సరస్వతి బాల స్వామీజీ, వాసవి ధామ్‌ పీఠాధిపతులు, పెనుగొండ

పేరు మార్పు సంతోషకరం

ప్రభుత్వం ఎంతో సహకరించింది. 2018లో ఎమ్మెల్యే పితాని సత్యనారా యణ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిశాం. ఆ సమయంలోనే పేరు మార్పు కోరాం. వాసవి మాత ఇక్కడ జన్మించింది. వాసవి పెనుగొండగా మార్చాలని అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అనంతపురం జిల్లా లో పెనుకొండ, తెలంగాణలో పెనుగొండ, పశ్చిమలో పెనుగొండ ఉన్నాయి. ఇతర దేశాల్లోని భక్తులు అయోమ యం గురికావడంతో వాసవి పెనుగొండగా మార్పు కోసం ప్రయత్నించాం. పేరు మారుస్తుండడం సంతోషంగా ఉంది.

– డాక్టర్‌ పీఎన్‌ గోవిందరాజులు, ట్రస్టు చైర్మన్‌

Updated Date - Nov 02 , 2025 | 01:15 AM